ఆంధ్రప్రదేశ్‌

మమ్మల్ని ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 9: రాజకీయ పార్టీలు మమ్మల్ని ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నాయి.. సమస్యలు మా వద్దకు వచ్చి అడిగితే మేమే చెప్తాం.. మీతో పాటు ఉద్యమిస్తాం.. ఎక్కడో కూర్చుని ఆరోపణలు చేస్తుంటే ఇక్కడ మా భూముల ధరలు పతనమవుతున్నాయి.. ప్రభుత్వం గ్రామ కంఠాల సమస్యలను తేల్చాలి..సిఆర్‌డిఎ ఏకపక్ష నిర్ణయాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని రాజధాని భూ సమీకరణ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం గుంటూరు వౌర్య ఫంక్షన్ హాలులో అమరావతి రాజధాని భూ సమీకరణ రైతుల సమాఖ్య సమావేశం జరిగింది. తుళ్లూరు, మంగళగిరి మండలాలకు చెందిన పలువురు రైతులు హాజరైన ఈ సమావేశంలో నెలాఖరులోగా గ్రామకంఠాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజధాని రైతులకు చేటు కలిగించే తీరులో వ్యవహరిస్తున్నారని సమావేశం ఆరోపించింది. అమరావతిలో రాజధాని నిర్మాణం జరగాలో..వద్దో తేల్చాలని రైతులు డిమాండ్ చేశారు. స్థానికంగా రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఉత్పన్న మవుతున్న సమస్యలను మేమే పరిష్కరించుకుంటున్నాం..గ్రీన్ ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపిస్తున్నాం.. ప్లాట్ల విధానం పారదర్శకంగా జరుగుతోంది.. కాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపు మేమే సాధించు కున్నాం.. క్షేత్రస్థాయిలో మేమే పరిష్కరించుకుంటుంటే మధ్యన రాజకీయ నేతలు చిచ్చులు పెడుతున్నందున నిలువునా నష్టపోయే పరిస్థితులు దాపురించాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌కు చిత్తశుద్ది ఉంటే ఇక్కడే నివాసం ఉండి సమస్యలు తెలుసుకోవాలని, ముఖ్యమంత్రి నివాసానికి దీటుగా ప్రతిపక్ష నేతకు ఇల్లు కట్టించాలని తామే ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రాజధాని ప్రాంతానికి టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించడంతో ఆధిపత్య పోరు నెలకొందని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. జగన్ ఇప్పటికైనా అమరావతి నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సిఆర్‌డిఎ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాజధానిపై తీసుకునే నిర్ణయాలలో రైతు సంఘాలను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో భూ సేకరణ పై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, డ్రెయినేజి తదితర వౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. అమరావతి ఆర్థిక రాజధాని కావాలంటే పాలక, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టాలని సూచించారు. ఈ నెలాఖరులోగా గ్రామ కంఠాల సమస్యలు తేల్చాలని డిమాండ్ చేశారు. సమాఖ్య ప్రతినిధులు శ్రీనివాస్, వడ్లమూడి పూర్ణచంద్రరావు, పెనుమాక సర్పంచ్ పానకాలరెడ్డి, రాజధాని గ్రామాల నుంచి వచ్చిన రైతులు సమావేశంలో పాల్గొన్నారు.