ఆంధ్రప్రదేశ్‌

గ్రాఫిక్స్‌లోనే రాష్ట్ర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 9: దేశంలో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని, అందుకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రజా సమస్యలపై పోరాటం సాగించాలని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్ళంరాజు కోరారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జన ఆవేదన సమ్మేళనంలో పళ్ళంరాజు మాట్లాడారు. ప్రధాని మోదీ తప్పుడు నిర్ణయాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిందన్నారు. దేశ ప్రజలు ఒక్క కాంగ్రెస్ పార్టీని మాత్రమే విశ్వసిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం దినపత్రికలు, టీవీ ఛానెళ్ళలో అభివృద్ధిని చూపిస్తోంది తప్ప వాస్తవంలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందన్నారు. రాజధానిని నిర్మిస్తున్నానంటూ ఆ అద్భుతాన్ని గ్రాఫిక్స్‌లో మాత్రమే ఆవిష్కరిస్తూ, ప్రజలను భ్రమల్లో ముంచుతున్నారని ఎద్దేవాచేశారు. కాం గ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించి, మండల స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.