ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణుల జీవితాల్లో బాబు వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి తమ ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కృతజ్ఞతలు తెలిపింది. ఆలయాల్లో పనిచేసే అర్చకులకు వారసత్వ హక్కును కల్పించి, వారి వయో పరిమితిని రద్దుచేసి వారి జీవితాల్లో వెలుగు నింపిన సందర్భంగా సన్మానించేందుకు సమయం కేటాయించాలని సంఘటన అధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ప్రతినిధులు బ్రాహ్మణుల వాస్తవ స్థితిగతులను ఆయన దృష్టికి తెచ్చారు. పేద బ్రాహ్మణులు ఇల్లు కట్టుకునేందుకు, ఉపనయనానికి, వైద్యానికి ఇలా అన్ని విధాలా సాయం చేస్తూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. బ్రాహ్మణుల్లో పేదరిక నిర్మూలన కోసమే దేశంలో ఎక్కడా లేనట్టుగా రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గుర్తుచేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించాలని బ్రాహ్మణ సంఘటన ప్రతినిధులు సిఎంకు విజ్ఞప్తి చేశారు. మిగిలిన సమస్యలు పరిష్కరిస్తామని సంఘటన ప్రతినిధులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.