ఆంధ్రప్రదేశ్‌

నంది ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించి ఉత్తమ చిత్రాల, ఉత్తమ కళాకారుల, సాంకేతిక నిపుణులకు సంబంధించి నంది ఫిల్మ్ అవార్డుల ఎంపిక కోసం నిర్మాతల నుంచి ఎంట్రీ ఫారాలను ఆహ్వానిస్తోంది. వివిధ కేటగిరీలలో 2014, 2015, 2016 సంవత్సరాలకు (ఆయా సంవత్సరాల్లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలం) గానూ తెలుగు భాషలో భారతదేశంలో నిర్మించిన, సెంట్రల్ బోర్డ్ సర్టిపికెట్ పొందిన చిత్రాల తరఫున ఆసక్తిగల నిర్మాతల నుంచి ఎంట్రీలకు ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టివి అండ్ ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ ఎస్.వెంకటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక కేటగిరీలో నమోదైన చిత్రాలు మరో కేటగిరీలో నమోదయ్యేందుకు అర్హత ఉండదని తెలిపారు. డబ్బింగ్, రీ మేక్ చిత్రాలు అవార్డులకు అర్హం కావు. అన్ని విధాలా పూర్తిచేసిన ఎంట్రీ ఫారాలను ఈ నెల 31 లోపు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దాఖలు చేయాలి. పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్‌సైట్ ఎపిఎస్‌ఎఫ్‌విటిడిసి.ఇన్‌ను దర్శించాలని తెలిపారు.