ఆంధ్రప్రదేశ్‌

పోరుబాటలో దేవాదాయ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 12: చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల సాధనకు పోరాటబాట పట్టాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదా య శాఖ ఉద్యోగులు నిర్ణయించారు. త్వరలో విధుల బహిష్కరించాలని నిర్ణయించారు. పోరాటానికి వీలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి)లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్ధల సిబ్బంది సంఘం రాష్ట్ర సమావేశం ఆదివారం జరిగిం ది. జిల్లా సంఘం అధ్యక్షులు కడలి అనంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడారు. 2007లో విడుదలచేసిన జీవో లు 820, 417, 326 అమలుచేయాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వం 65ఎ ద్వారా ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు కమిటీలంటూ కాలయాపన చేస్తున్నారని, ఇక ఉద్యమమే శరణ్యమన్నా రు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి వేతన అర్చకులు, దేవాలయాల ఉద్యోగులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు. అలాగే రాష్టస్థ్రాయిలో కూడా జెఎసి ఏర్పాటుచేసి, పోరాటం సాగిస్తామన్నారు. వచ్చే నెలలో దేవాలయాలు, సత్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరితో కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనురాధకు విధులు బహిష్కరణ నోటీసులను అందిస్తామన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్ (తూర్పు గోదావరి), సిహెచ్.చిననాగేశ్వరరావు (పశ్చిమ గోదావరి), ఎ.శ్రీనివాసరావు (గుంటూ రు), ఎం.శ్రీనివాసరావు (ప్రకాశం) పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు