ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా ముగిసిన తెప్పోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 12: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం స్వామివారి పుష్కరిణిలో శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై వివిధ రకాల పుష్పాలతో పాటు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. తెప్పోత్సవంలో స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఏడుమార్లు తెప్పపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఆదివారం పౌర్ణమి కావడంతో స్వామివారి తెప్పోత్సవ వైభవం చంద్రుని దేదీప్య వెలుగులలో ద్విగుణీకృతమై భక్తులను తన్మయులను చేసింది. చివరిరోజు తెప్పోత్సవాలలో టిటిడి అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెప్పోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు ఆదివారం సాయంత్రం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను టిటిడి రద్దు చేసింది.
ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వాయువ్య దిశలో వెలసి ఉన్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఆదివారం ఘనంగా జరిగింది. ఈ పర్వదినాన ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులు ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. కుమారధార తీర్థముక్కోటిలో వందలాదిగా భక్తులు పాల్గొని పుణ్యస్నానమాచరించారు. టిటిడి భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు ఏర్పాట్లను చేసింది.

చిత్రం..తెప్పపై విహరిస్తున్న శ్రీవారు