ఆంధ్రప్రదేశ్‌

10 రూపాయల నాణెం రద్దుపై పుకార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: పెద్ద నోట్ల రద్దు తరువాత అప్పట్లో పాత 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లను చూస్తే జనం ఉలిక్కిపడేవారు. రద్దు అయిన నోట్లను మార్చుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. వాటిని వదిలించుకునేందుకు పడిన పాట్లు దేవుడికే ఎరుక. తాజాగా 10 రూపాయల నాణెం చూస్తే కూడా ప్రజలు అలానే భయపడుతున్నారు. కొత్తగా 10 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురానున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో 10 రూపాయల నాణేలను తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. పాత 10 రూపాయల నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బిఐ ప్రకటించింది. అయితే 10 రూపాయల నాణెలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయకపోవంతో ఆ నాణేలు రద్దు కానున్నాయన్న ప్రచారం జోరందుకుంది. దీంతో వ్యాపారులు, ఆటోవాలాలు ఆ నాణేలను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. రైతు బజార్లలో కూడా చెల్లుబాటు కాని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు బ్యాంక్‌ల వైఖరి కూడా ప్రజల్లో గందరగోళానికి తావిస్తోంది. 10 రూపాయల నాణేలను బ్యాంక్‌లకు తీసుకవెళ్లి జమ చేసేందుకు ప్రయత్నిస్తే, నాణేలను తాము తీసుకోమంటూ అక్కడి సిబ్బంది చెబుతున్నారు. నోట్ల రద్దు సమయంలో 10 రూపాయల నాణేలను కూడా వివిధ బ్యాంక్‌లు చలామణిలోకి తీసుకువచ్చాయి. 10 రూపాయల నాణేల సంచులను బ్యాంక్‌లు ఖాతాదారులకు అందచేశాయి. ఇప్పుడు వాటిని వివిధ సందర్భాల్లో ఖర్చు పెట్టేందుకు ప్రయత్నించినపుడు, వాటిని తీసుకోమన్న సమాధానంతో అవాక్కు అవుతున్నారు. ఆర్‌బిఐ, వివిధ బ్యాంక్‌లు 10 రూపాయల నాణేల చెల్లుబాటుపై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది. దానికి ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి కూడా.