ఆంధ్రప్రదేశ్‌

పట్టింపులకు ఇదా సమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆఖరి క్షణం వరకు పరితపించిన తన తండ్రి భూమా నాగిరెడ్డి అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకు ఇక తండ్రిని తలచుకుని ఏడవ కూడదని గట్టిగా నిర్ణయించుకున్నా... అవన్నీ నెరవేరిన తర్వాత మనస్ఫూర్తిగా ఏడుస్తానంటూ ఆయన కుమార్తె అఖిలప్రియ ఎంతో ఉద్వేగంతో చెప్పారు. శాసనసభలో మంగళవారం సిఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై పలువురు మాట్లాడిన తర్వాత చివరగా ఆమె మాట్లాడే సమయంలో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. సిఎం చంద్రబాబుతో సహా సభ్యులందరూ ఆమె ప్రసంగం పూర్తయ్యే వరకు ఆమె వైపే చూస్తూ ఉండిపోయారు. తండ్రిని తలచుకుని నిన్నటి వరకు ఏడ్చాను.. ఇక ఏడవబోనని అఖిలప్రియ చెప్పారు. రాత్రి వేళల్లో ఆ నియోజకవర్గంలో తాను చేపట్టాల్సిన పనులు గురించి తనకు చెబుతుండే వారని, పేదల కోసం 10వేల ఇళ్లు కట్టించాలనేది ఆయన ధ్యేయంగా ఉందన్నారు. కొత్త అసెంబ్లీ భవనంలో తానెప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తుండగా ఇలా తండ్రి గురించి మాట్లాడాల్సి వస్తుందనుకోలేదన్నారు. తొలుత తండ్రి, ఆపై ముగ్గురు సోదరుల మరణానంతరం కొందరు ఆస్తుల పంపకాల కోసం వస్తే ఆస్తులన్నీ తీసుకుపోండి పిల్లలను తనకు వదలమని చెప్పి వారందరినీ తమతో సమానంగా చూసుకుంటూ పెళ్ళిళ్ళు కూడా జరిపించారని అన్నారు. తన తల్లి మరణానంతరం సభకు ఎన్నికైన తనను చెయ్యి పట్టుకుని ప్రతి ఒక్కరినీ పరిచయం చేశారు.. తన మరణం గురించి తెలిసే అందరికీ దగ్గర చేసారేమోనని అనుకుంటున్నా.. చివరి సమయంలోనూ తన వెంట ఉండే కౌన్సిలర్లు, జెడ్పీటిసి, ఎంపిటిసి సభ్యులను వెంట పెట్టుకు వచ్చి చంద్రబాబుకు పరిచయం చేయటంలో కూడా అదే ఆంతర్యం ఉండి ఉంటుందన్నారు. తన తల్లి అంటే తండ్రికి ఎంతో ప్రేమాభిమానం. ఆమెను మరచిపోటానికే అన్నట్లు రాజకీయాల్లో బిజిగా గడుపుతూ వచ్చారు. బైట ఎంతో ధైర్యంగా హుందాగా ఉన్నా రాత్రి వేళ అమ్మ ఫోటోకి దండం పెట్టి దీపం వెలిగించిగాని నిద్దురపోయేవాడుకాదని అన్నారు. వారం రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోయినా స్థానిక ఎన్నికల గురించే ఆలోచిస్తుండేవారు.. ఆసుపత్రిలో ఆక్సిజన్ పెట్టించుకునే సిఎం టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. చివరగా వారి సలహా కూడా లెక్కచేయక విజయవాడ వచ్చారని అన్నారు. అందరూ అనుకుంటున్నట్టు తల్లి, తండ్రిని కోల్పోయిన నేను అనాథను కాను.. చంద్రబాబు ఇచ్చిన భరోసా నాలో ఆత్మస్థైర్యం నింపిందన్నారు. ఇంటి పెద్దగా సోదరికి, సోదరుడికి.. అలాగే రెండు నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలకు అండగా నిలువాలని నిశ్చయించుకున్నట్లు స్పష్టంగా చెప్పారు. తండ్రిని ఆసుపత్రికి చేర్చిన వెంటనే లోకేష్ బాబు వచ్చి వైద్యుల బృందాన్ని అప్రమత్తం చేశారన్నారు. అదే సమయంలో సిఎం చంద్రబాబు కూడా హైదరాబాద్‌కు తరలించేందుకు హెలికాప్టర్ పంపించారు.. అయితే ఆళ్లగడ్డ, నంద్యాలలో సరైన వైద్యం అందుబాటులో లేకపోయినా డాక్టర్లు తన తండ్రిని బతికించేందుకు ఎంతగానో శ్రమించారని అన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే తన తల్లి చికిత్స పొందుతూ మరణించిన బెడ్‌పైనే తండ్రి చనిపోయాడని అన్నారు. ఇక జగన్ జైల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇరువురూ పార్టీకి ఎన్నో సేవలందించారు. అలాంటి వ్యక్తి ఓదార్చాటానికి రాలేదు. కనీసం ఈ సమయంలోనూ రాలేదు. ఇదేనా మర్యాదా.. నాకెంతో బాధగా ఉన్నా వారికే వదిలేస్తున్నానంటూ ఉద్వేగంతో ప్రసంగం ముగించారు.

చిత్రం..సంతాప తీర్మానంపై మాట్లాడుతున్న అఖిలప్రియ