ఆంధ్రప్రదేశ్‌

ఇదేం ప్రజాస్వామ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 14: ప్రధాని రాజ్యాంగాన్ని, దాని విలువలను గాలికి వదిలేసి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యన్ని నడిరోడ్డులో ఖూనీ చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం నెల్లూరులోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోవా, మణిపూర్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్‌ను కాదని తక్కువ సీట్లు కలిగిన బిజెపికి అక్కడి గవర్నర్‌లు ప్రభుత్వానికి అవకాశమివ్వడం దుర్మార్గమన్నారు. ప్రజాభిమానాన్ని చూరగొనలేక అడ్డదారిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునేలా బిజెపి ప్రభుత్వ వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు.
ప్రధానికి నరేంద్రమోదీ ఎన్నికైనా తరువాత ఉత్తరఖాండ్ లోనూ ఇదే పద్ధతిని అవలభించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో వెనక్కి తగ్గారన్నారు. చెన్నైలో జయలలిత మరణంతో ప్రభుత్వంలో సంక్షోభం సృష్టించి మోదీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూశారన్నారు. గవర్నర్‌ల సైతం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బిజెపి డైరెక్షన్‌లో నడస్తుండటం దుర్మార్గమన్నారు. దీనిపై టిడిపి నేతలు తేలు కుట్టిన దొంగల్లా వౌనంగా ఉంటున్నారని, ప్రశ్నించే ధైర్యం వాళ్ళకు లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ సైతం మోదీకి గోవా, మణిపూర్ సిఎం పదవులు చేపట్టబోయే నేతలకు శుభాకాంక్షలు తెలపడం సిగ్గుచేటు అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 600లకు పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దేశంలోనే అవినీతిలో నెంబర్‌వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ బూధాటి రాధయ్య, సివి శేషారెడ్డి, రఘురామ్ ముదిరాజ్, చేవూరు దేవకుమార్‌రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, ఉడతా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎప్పటికీ రారాజే
ఇదిలావుండగా ఆత్మకూరులో మంగళవారం జరిగిన జనవేదన సభలో పిసిసి చీఫ్ రఘవీరా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రారాజేనన్నారు. అయితే భావోద్వేగంతో రాష్ట్రప్రజలు పార్టీ అభ్యర్థలను ఓడించారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి రెండు రకాల భావోద్వేగాలు కారణమన్నారు.

చిత్రం..నెల్లూరులో విలేఖరులతో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి