తెలంగాణ

ఐటికి రూ. 364 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఐటి రంగానికి రూ. 364 కోట్లు కేటాయించారు. 2020 నాటికి ఏపిని టెక్నాలజీ పరంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే 2014లో సరికొత్త ఐటి, ఎలక్ట్రానిక్స్ విధానంతో ముందుకు వచ్చిందని చెప్పారు. దీని వల్ల ఇప్పటి వరకు 4,755 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించామని తెలిపారు. రూ. 3,649 కోట్ల ఐటీ పెట్టుబడుల పురోగతిని వివిధ స్థాయిల్లో ఏపి సాధించిందని వివరించారు. 2017-18 సంవత్సరాన్ని ఈ-ప్రగతి సంవత్సరంగా యనమల ప్రకటించారు. పౌరులకు, వివిధ రకాల సేవలను సమగ్రంగా, ఉచితంగా అందించడమే ఈ-ప్రగతి ఉద్దేశమని ఇందుకు 33 ప్రభుత్వ శాఖలు, 315 సంస్థలు, 745 సేవలు అనుసంధానించనున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 570 కోట్ల ఐటి ఉత్పత్తులు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు.