ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థుల ఆత్మహత్యలపై సభా సంఘానికి నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: విద్యార్థుల ఆత్మహత్యలపై సభా సంఘాన్ని నియమించాలని కొంతమంది ఎమ్మెల్సీలు పట్టుబట్టినప్పటికీ, అందుకు మండలి చైర్మన్ చక్రపాణి నిరాకరించారు. ఇప్పటికే నియమించిన ద్విసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ఆదేశించారు. రాష్ట్ర శాసన మండలిలో గురువారం నాటి ప్రశ్నోత్తర సమయంలో విద్యార్థులపై ఆత్మహత్యలకు కారణాలను అధ్యయనం చేసేందుకు ద్విసభ్య సంఘం నివేదిక అందచేసిందా? అంటూ ఎమ్మెల్సీలు మహమ్మద్ జానీ, విశ్వప్రసాదరావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి పల్లె రఘనాథ రెడ్డి బదులిస్తూ ఇద్దరు సభ్యులతో కమిటీని నియమించామని, ఏప్రిల్ 15న ఆ కమిటీ నివేదిక అందించనుందని తెలిపారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ కమిటీ నివేదికకు నిర్దిష్ట సమయం అవసరమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు తెలియవా? విద్యా శాఖ మంత్రి సభకు ఎందుకు రారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలు జైళ్లుగా మారాయని, విద్యార్థుల పట్ల నిరకుశంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు సభా కమిటీని నియమించాలని డిమాండ్ చేస్తూ, ఎమ్మెల్సీలు గేయానంద్, ఎంవిఎస్‌శర్మ, శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, సూర్యారావు వెల్‌ల్లోకి దూసుకువెళ్లారు. సమస్య తీవ్రత అర్ధం చేసుకుని కమిటీ వేయాలని చైర్మన్ చక్రపాణిని కోరారు. దీనిపై అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్సీలు కొంతమంది లేచి ఇప్పటికే కమిటీ నియమించారని గుర్తు చేశారు. దీంతో అక్కడ స్వల్ప గందరగోళం నెలకొంది. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో సభా కమిటీని వేసేందుకు చైర్మన్ నిరాకరిస్తూ, ద్విసభ్య కమిటీ నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆదేశించారు.