ఆంధ్రప్రదేశ్‌

బాలికల విద్యకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: జాతీయ స్థాయిలో బాలికల విద్యా ప్రోత్సాహానికి తీసుకోవల్సిన చర్యలపై ‘కేబ్’ నియమించిన మంత్రుల స్థాయి సబ్‌కమిటీ తొలి సమావేశం శనివారం నాడు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సబ్‌కమిటీకి తెలంగాణ విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా అస్సాం విద్యామంత్రి హేమంత బిశ్వశర్మ, జార్ఖండ్ మంత్రి నీరా యాదవ్ ఉన్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్ సభ్యకార్యదర్శిగా ఉన్నారు. దేశస్థాయిలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు, బాలికా విద్యలో వెనుకబాటుతనానికి కారణాలను తెలుసుకోవడానికి ఈ కమిటీ అనేక ప్రతిపాదనలు చేయనుంది. బాలికా విద్యకు సరైన ప్రాధాన్యం లేకపోవడానికి వారి సామాజిక, ఆర్థిక అంశాలు, లింగవివక్ష తదితర అంశాలు ఎంత వరకూ కారణమో కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.
విద్యలో లింగ వివక్షను రూపుమాపేందుకు తీసుకోవల్సిన చర్యలను ప్రతిపాదించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఈ కమిటీని కోరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి బాలికల నమోదు శాతం ఎంత ఉందో కూడా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారీ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో బాలికల నమోదును ఈ కమిటీ విశే్లషించనుంది. దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఏయే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉత్తమ విధానాలను అమలుచేస్తున్నారో వాటన్నింటినీ అధ్యయనం చేసి దేశంలో బాలికల విద్యను పెంపొందించే కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను సమర్పించనుంది. ఏడాదిలోపు వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంది.