ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 17: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకుబాటు, అభివృద్ధి అంశాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాలమైన విశాఖను ఇందు కు వేదికగా చేసుకుంటామని, తమ తో వచ్చిన వారందర్నీ కలుపుతూ ముం దుకు సాగుతామని చెప్పారు. వీటి వెనుకబాటుపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక గణాంకాలతో సహా వివరించిందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, స్థూల ఉత్పత్తి, సాగునీటి లభ్యత, మాతా శిశు మరణాలు వంటి అనేక రంగాల్లో మానవాభివృద్ధి సూచికల్లో ఈ వెనుకబాటు వ్యక్తమవుతోందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం లో సెక్షన్ 46లో ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని, షెడ్యూ ల్ 13లో ఐఐఎం, పెట్రో యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని, ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైల్వేజోన్, మెట్రోరైల్ నిర్మాణం చేపడతామని హామీనిచ్చా రు. అలాగే రాయలసీమకు కడప ఉక్కు అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం మరికొన్ని విద్యాసంస్థలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాయలసీమ తీవ్ర కరవుకు గురవుతున్నా సహాయక చర్యలు లేవని, అయితే గత రెండేళ్ళల్లో జిల్లాకు కేవలం రూ.50 కోట్లు వంతు న ఏడు జిల్లాలకు రెండేళ్ళల్లో కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖలోని వైద్య కేంద్రం విమ్స్‌కు ఒక్కపైసా కూడా కేటాయించలేదని, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు నేటికీ మోక్షం కలగలేదన్నారు. పైగా సాంకేతిక కారణాలు చూపుతూ కేంద్ర మంత్రులు మాట్లాడటం ప్రజ ల్లో ఆగ్రహానికి కారణమవుతోందన్నా రు. విశాఖ మెట్రోరైలు నిర్మాణం కోసం పరిశీలన, రిపోర్టులు వచ్చినా ఇంకా ప్రాజెక్టు శంకుస్థాపన సైతం జరగలేదన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఈ అంశాలపై చర్చ జరిపి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాల్సి ఉందన్నారు. దీనివలనే రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్నారు. అలాగే అసెంబ్లీలో చర్చ ప్రజల అభిష్టానం మేరకు జరపాలని మధు డిమాండ్ చేశారు.