ఆంధ్రప్రదేశ్‌

ల్యాండ్ సీలింగ్ అధికారి లంచావతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 17: ఓ వైపు అవినీతి నిరోధక శాఖ అక్రమార్కులపై నిఘా వేసి, వారి అక్రమార్జనపై దాడులు జరుపుతున్నా, అవినీతిపరులు మాత్రం ఏమాత్రం వెరవకుండా అక్రమ సంపాదనను కొనసాగిస్తునే ఉన్నారు. విశాఖలోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ముమ్మన రాజేశ్వరరావు ఆస్తులపై ఏసిబి అధికారులు శుక్రవారం జరిపిన దాడుల్లో దాదాపూ పదిహేను కోట్ల అక్రమార్జన వెలుగులోకి వచ్చింది. ఏసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ డిఎస్పీ రమాదేవి నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో రాజేశ్వరరావు అక్రమార్జన భారీగానే బయటపడింది. స్థానిక మురళీనగర్ ఎన్‌జిజిఓ కాలనీలో నివాసం ఉంటున్న రాజేశ్వరరావు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అక్రమార్జనకు అలవాటుపడ్డాడు. 1990 నవంబర్ ఒకటో తేదీన అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగంలో డిప్యూటీ సర్వేయర్‌గా విధుల్లో చేరాడు. 1998లో సర్వేయర్‌గా పదోన్నతి పొందాడు. 2014లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ పదవిని చేపట్టాడు. ఈ సమయంలోనే ఆయన అవినీతి సంపాదన అనూహ్యంగా పెరిగిపోయింది. మధురవాడలో 1175 ఎస్‌ఎఫ్‌టితో కూడిన ఒక ఫ్లాట్ ఉంది. మురళీనగర్‌లో ఆయన భార్య శేషసాయి పేరిట జి ప్లస్ 3 భవనం, విజయనగరం జిల్లా ఎల్‌కోట మండలం లచ్చంపేటలో 450 చదరపు గజాల స్థలం, ఇక్కడే మరో 190 చదరపు గజాల స్థలం ఉంది. అలాగే రాజేశ్వరరావు కుమార్తె లిఖిత ప్రియాంక పేరిట పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో సాయి ప్రగతి లేఅవుట్‌లో 240 చదరపు గజాల స్థలం ఉంది. విశాఖలోని చినగదిలిలో 1015 ఎస్‌ఎఫ్‌టితో కూడిన ఒక ఫ్లాట్ ఉంది. రాజేశ్వరరావు మరో కుమార్తె వాసవి ప్రమీల పేరుతో 1365 ఎస్‌ఎఫ్‌టితో కూడిన ఒక ఫ్లాట్ ఉంది. వీటితోపాటు ఒక కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని ఏసిబి అధికారులు కనుగొన్నారు. అలాగే 400 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి, 10000 రూపాయల నగదు, 50 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రాజేశ్వరరావు ఇంటితోపాటు, ఆయన బంధువులు, స్నేహితులు ఉన్న ఆరు ఇళ్ళపై ఏక కాలంలో దాడులు జరిగాయ.
చారు.

చిత్రం.. రాజేశ్వరరావు