ఆంధ్రప్రదేశ్‌

అవినీతిపరులే అంటరానివారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 17: సమాజంలో అవినీతికి పాల్పడేవారే అంటరానివారని, లంచం తీసుకున్న వ్యక్తి పట్ల కుటుంబంలో, సమాజంలో, పనిచేసే కార్యాలయాల్లోనూ గౌరవం ఉండదని ఏపి అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ అన్నారు. గడిచిన మూడు నెలల్లో రాష్ట్రంలో అవినీతిని అదుపు చేయగలిగామన్నారు. ఏసిబి శాఖకు ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటుకు సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు. విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన త్రైమాసిక నివేదిక వివరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది 2016లో 104 లంచం కేసులు నమోదు చేయగా, అక్రమాస్తులకు సంబంధించి 50 కేసులు నమోదైనట్లు చెప్పారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి 30 లంచం కేసులు, ఐదు అక్రమాస్తుల కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గత ఏడాది 2016లో లంచం కేసుల్లో 35లక్షల సొమ్ము సీజ్ చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగిందన్నారు. గత ఏడాది సీజ్ చేసిన అక్రమాస్తుల విలువ సుమారు 140.51కోట్లు కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరికి సీజ్ చేసిన అక్రమాస్తుల విలువ 17.20 కోట్లుగా పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో అరెస్టయిన నిందితులపై ప్రత్యేక కోర్టులో విచారణ జరగ్గా 2016లో 65శాతం శిక్ష శాతం కాగా, ఈ మూడు మాసాల్లో 80 శాతం శిక్ష శాతాన్ని సాధించినట్లు చెప్పారు. తాను ఏసిబి డిజిగా బాధ్యతలు చేపట్టాక ఆశించిన పురోగతి సాధించామని చెప్పారు.

చిత్రం..అవినీతి కేసుల నివేదిక వివస్తున్న ఏసిబి డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్