ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: తమ డిపాజిట్లు ఇప్పించాలని, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం చేసి, అవ్వాస్ సోదరులను అరెస్టు చేయాలని కోరుతూ నగరంలో జరుగుతున్న బాధితుల నిరవధిక దీక్షలను పోలీసులు కకావికలం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని 11రోజులుగా రిలే దీక్షలు, మూడురోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసు బలగాలు బలవంతంగా హనుమంతరాయ గ్రంథాలయంలోకి చొరబడి నిరవధిక దీక్షలో ఉన్న 17మందిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తోటి బాధితులను కూడా పోలీస్ వ్యాన్‌లోకి బలవంతంగా విసిరేశారు. అర్ధరాత్రి నగరమంతా తిప్పి, తిరిగి హనుమాన్‌పేటలో రోడ్డుపై వదిలేశారు. పోలీసుల నిరంకుశ చర్యలను నిరసిస్తూ బాధితులంతా అక్కడే రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఎఐటియుసి నగర నాయకులు బుద్దె రాజా హుటాహుటిన హనుమాన్‌పేటలో ఆందోళనకు దిగిన బాధితులను పరామర్శించారు. పోలీసులను అక్కడి నుండి పంపించేశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. నిరవధిక దీక్షలో ఉన్న అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు ఆరోగ్యం సహకరించకపోయినా ఆసుపత్రిలోనే బైఠాయించి నిరసన తెలిపారు.
బాధితుల ఆరోగ్యం క్షీణిస్తున్నందునే వారిని ఆసుపత్రికి తేవాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు. విషయం తెలుసుకున్న అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు, ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జివి సత్యనారాయణరాజు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ దోనేపూడి శంకర్‌లతో కలిసి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ముప్పాళ్ల విలేఖర్లతో మాట్లాడుతూ నిరవధిక దీక్షలో ఉన్న బాధితుల పట్ల పోలీసులు, ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలు అప్రజాస్వామికమని తీవ్రంగా ఖండించారు. అనంతరం నాయకులందరూ హనుమంతరాయ గ్రంథాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి వందల సంఖ్యలో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. తమవాళ్ల అరెస్టయినాసరే తాము దీక్షలు కొనసాగిస్తామని కొందరు బాధితులు ముందుకొచ్చారు.
ఎనిమిది మంది నిరవధిక నిరాహార దీక్షలకు, 20 మంది రిలే దీక్షలకు సిద్ధమయ్యారు. అసోసియేషన్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ బివి చంద్రశేఖర్ (కడప) నేతృత్వంలో ఎస్ గోవర్ధన్(చిత్తూరు), బాషా(కర్నూలు), వై సూరిబాబు(అనకాపల్లి), ఆరేలమ్మ(శ్రీకాకుళం), కె జయంతి(తిరుపతి), తిరుపాములు (కర్నూలు), పద్మ (పిడుగురాళ్ళ) నిరవధిక దీక్షలో కూర్చున్నారు. వారికి చలసాని శ్రీనివాస్ పూలమాలలు వేసి నిరవధిక దీక్షలను ప్రారంభించారు.