ఆంధ్రప్రదేశ్‌

గ్రామాల్లోనూ ఎల్‌ఇడి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: ఏడాదిలోగా ప్రతి గ్రామంలో ఎల్‌ఇడి ట్యూబులైట్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శుక్రవారం రాత్రి అమరావతిలో ఎల్‌ఇడి ట్యూబులైట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని సిఎంవో నుంచి ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని మందడం, వెలగపూడి గ్రామస్తులకు ముఖ్యమంత్రి ఎల్‌ఇడి ట్యూబులైట్లు పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో బల్బు, ఫ్యాను, ఎల్‌ఇడి ట్యూబులైటు ఉండాలని కోరారు. అన్ని పంచాయతీల్లో విద్యుత్ ఆదాతో కూడిన ఎల్‌ఇడి ట్యూబ్‌లైట్లు అమర్చాలని ముఖ్యమంత్రి కోరారు. గ్రామాల్లో పూర్తిస్థాయి ఎల్‌ఇడి బల్బులను అమర్చేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించుకోవాలన్నారు. ఎల్‌ఇడి బల్బుల వాడకంలో ప్రపంచంలోనే మనం ముందు నిలిచామని సిఎం తెలిపారు. ఇంధన సామర్థ్యం లేని 15 లక్షల వ్యవసాయ పంపుసెట్లను ఉచితంగా మార్పుచేసే కార్యక్రమాన్ని దశలవారీగా చేపట్టిన అంశాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో కోటి మంది విద్యుత్ వినియోగదార్లకు 2 కోట్ల ఎల్‌ఇడి విద్యుత్ దీపాలను పంపిణీ చేశామన్నారు. విభజన సమయంలో నవ్యాంధ్రలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని, నిరంతర విద్యుత్ వాడకంలో రెండు నెలలలోనే అధిగమించి, ఏడాదిలోనే విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దామని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ జి.్భవానీప్రసాద్, ఎండి సారబ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.