ఆంధ్రప్రదేశ్‌

భవన నిర్మాణానికి సిసి కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 18: టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ విభాగంలో వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. భవన నిర్మాణంపై సిసి కెమెరాలను ఏర్పాటు చేసి దానిని ఎపి ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయాలనే నిబంధన తాజాగా అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. భవన నిర్మాణాన్ని ఆన్‌లైన్‌లో సమీక్షించే విధంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిబంధన అమల్లోకి రానుంది. సిసి కెమెరాలను ఎపి పైబర్ నెట్ వర్క్‌కు అనుసంధానం చేయాల్సి వుంది. ఈ మేరకు ఆర్‌ఒసి నెంబర్ 2114-2015-పి సర్వ్యులర్ మార్చి 1వ తేదీన జారీ అయింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ నోట్ ఆర్డర్ మేరకు ఈ విధానం అమల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. బహుళ అంతస్థులు నిర్మించేవారంతా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సి వుంది. ఎప్పటికపుడు సిసి కెమెరాల్లో నిక్షిప్తమైన విజువల్స్‌ను తిలకించి అనుమతి మేరకు నిర్మాణం జరుగుతోందా లేదా అనేది టౌన్ అండ్ కంట్రీప్లాన్ డైరెక్టరేట్ నుంచి వీక్షిస్తారు. నూతనంగా చేపడుతున్న సంస్కరణల వల్ల గ్రామాల్లో సైతం ఏ నిర్మాణం అనుమతి పొందాలన్నా డైరెక్టరేట్ నుంచే అనుమతి పొందాల్సి వుంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు నుంచి వారానికొకసారి దరఖాస్తులను గుంటూరులోని డైరెక్టరేట్‌కు పంపించి అనుమతి పొందే విధానం కొనసాగుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కేవలం ఇంటిప్లాన్‌లను క్షేత్ర స్థాయిలో చూసి అనుసంధానం చేయడం ఒకటే పని. మిగిలిన తతంగమంతా గుంటూరు డైరెక్టరేట్‌లోనే అనుమతి పొందాల్సి వుంది. గతంలో అయితే ఎక్కడికక్కడ స్థాయిలను బట్టి అనుమతులు లభించేవి. అధికార వికేంద్రీకరణలో భాగంగా అక్కడికక్కడ పనులు సత్వరం అయ్యే విధంగా ఉండేది. ఇపుడు ఆన్‌లైన్ సౌలభ్యం వచ్చిన తర్వాత మొత్తం అనుమతులన్నీ డైరెక్టర్ కార్యాలయంలోనే పూర్తిచేసేవిధంగా చర్యలు చేపట్టారు. దీంతో పెద్దవి ఎలాగూ డైరెక్టరేట్ నుంచి అనుమతులు రావాల్సి వుంది కాబట్టి దాని విషయం పక్కనబెడితే చిన్న చిన్న నిర్మాణాలకు సైతం డైరెక్టరేట్ నుంచే అనుమతి రావాల్సి ఉండటంతో కాలాతీతమై నిర్మాణ అనుమతులు పెండింగ్ పడి పేరుకుపోతున్నాయంటున్నారు.