ఆంధ్రప్రదేశ్‌

జూన్‌లో నంద్యాల ఉప ఎన్నిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 18: కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ స్థానానికి జూన్‌లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో భారత రాష్టప్రతి ఎన్నిక నిర్వహించనున్నందున ఆ ఎన్నిక నాటికి దేశంలో ఎక్కడా శాసనసభ, పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఖాళీలు ఉండకూడదని, అన్నింటికీ ఉప ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపధ్యంలో భూమా నాగిరెడ్డి మరణంతో ఖాలీ అయిన నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక జూన్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ప్రజాప్రతినిధులు మరణించినా, రాజీనామా చేసినా ఖాళీ అయ్యే శాసనసభ స్థానానికి 6 నెలల వరకు గడువు ఉంటుంది. అయితే రాష్టప్రతి ఎన్నికలు ఉన్నందున జూన్ లోపు ఎన్నిక పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు అందుకున్న జిల్లా అధికారులు భూమా నాగిరెడ్డి మరణ ధృవీకరణ పత్రం తదితర వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపధ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించాయి. అధికార తెలుగుదేశం పార్టీ తరపున నాగిరెడ్డి చిన్నకుమార్తె నాగవౌనిక, అన్న కుమారుడు భూమా బ్రహ్మనందరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల టిడిపి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిని నిలబెడతామని ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థి ఎవరన్న అంశంపై చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం భూమా కుటుంబానికి ధీటుగా నిలబడే గంగుల కుటుంబం నుంచే అభ్యర్థిని ఎంపిక చేయవచ్చని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు రంగంలో ఉంటారని అనుకుంటున్నారు. మరోవైపు నంద్యాలలో స్థానికుడైన ముస్లిం అభ్యర్థిపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.