ఆంధ్రప్రదేశ్‌

డిసిఐని ప్రైవేటీకరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 18: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ)ని ప్రైవేటీకరించబోమని సెంట్రల్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్, షిప్పింగ్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవ్య స్పష్టం చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం మాందవ్య శనివారం విశాఖ నగరానికి వచ్చారు. డిసిఐ కార్యాలయంలో సిఎండి రాజేష్ త్రిపాఠి డిసిఐ కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తరువాత మంత్రి మాండవ్య కార్యాలయ ఆవరణలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఉద్యోగులను కలుసుకున్నారు. యూనియన్ జనరల్ సెక్రటరీ నర్సింగరావు ఈ సందర్భంగా మంత్రికి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. 40 ఏళ్ళుగా దేశానికి సేవలందిస్తున్న డిసిఐని ప్రైవేకరించవద్దని కోరారు. 51 శాతం వాటాలను విక్రయించడం వలన సంస్థకు భారీ నష్టం సంభవించనుందని మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ డిసిఐని ప్రైవేటీకరించబోమని చెప్పారు. తాను విశాఖ వస్తున్న ముందు డిసిఐ ఫైళ్లను కూడా పరిశీలించానని మాండవ్య చెప్పారు. వ్యూహాత్మకంగా డిసిఐ షేర్లను విక్రయించే అంశం తమ ముందు లేదని చెప్పారు. అందువలన నల్ల బ్యాడ్జీలను తొలగించాలని మంత్రి మాండవ్య ఉద్యోగులకు సూచించారు. సంస్థను ప్రైవేటీకరించడం లేదని లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉద్యోగులు మంత్రి కి తెలిపారు. త్వరలోనే సంస్థకు సంబంధించి ఒక ప్రకటన చేస్తామని మంత్రి చెప్పారు. మంత్రి వెంట విశాఖ ఎంపి హరిబాబు, డిసిఐ సిఎండి రాజేష్ త్రిపాఠి తదితరులు ఉన్నారు.
పోర్టులో కార్యకలాపాల పరిశీలన
విశాఖ పోర్టు ట్రస్ట్ కార్యకలాపాలను మంత్రి మాండవ్య శనివారం పరిశీలించారు. పోర్టు చైర్మన్ కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోర్టు కార్యకలాపాలను మంత్రికి వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కింద చేపట్టే పనులకు 30 ఏళ్లపాటు కన్‌సెషన్ అగ్రిమెంట్ కోరుతున్నారని, దీన్ని పరిశీలించాలని కృష్ణబాబు మంత్రిని కోరారు. పోర్టులో పనిచేసే ప్రతి ఉద్యోగ స్వచ్ఛ్భారత్‌లో పాల్గొనాలని మంత్రి సూచించారు. దీనివలన పోర్టుతోపాటు, వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుందని అన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో పోర్టు తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. పోర్టులో ఏర్పాటు చేసిన 10 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే తొమ్మిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వీటి వలన జరుగుతోంది. అలాగే పోర్టులో ఆటోమేటిక్ క్లీనింగ్‌ను కూడా మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పోర్టులో ఆయన మొక్కలు నాటారు.

చిత్రం..డిసిఐ ఉద్యోగులతో చర్చలు జరుపుతున్న మంత్రి మాండవ్య