ఆంధ్రప్రదేశ్‌

రుణ మాఫీలో సవతితల్లి ప్రేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: రుణమాఫీ వర్తింపులో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నదంటూ రైతునేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వేర్వేరు ప్రకటనల్లో ధ్వజమెత్తారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఉత్తరప్రదేశ్ తరహాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రుణమాఫీ అమలు చేయాలన్నారు. యుపి ఎన్నికల్లో చిన్న, సన్నకారు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. మొత్తంపై అక్కడ బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే రుణమాఫీ వల్ల యుపి సర్కార్‌పై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ లోక్‌సభలో స్పష్టం చేశారు. అసలు ఈవిధంగా ప్రాంతాల పట్ల పక్షపాతం చూపడం వల్ల దేశ సమైక్యతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలు తీసుకున్న వందలు, వేల కోట్ల రూపాయల మొండి బకాయిలను కేంద్రం ఉదారంగా రద్దు చేస్తుందని శివాజీ విమర్శించారు. ఆసక్తికర అంశం ఏమిటంటే కార్పొరేట్ శక్తులు తాము తీసుకున్న రుణంతో నిత్య జీవితంలో భోగభాగ్యాలు అనుభవిస్తూ విదేశాల్లో స్వైరవిహారం చేస్తూ వేల కోట్లను దారి మళ్లిస్తుంటారు. అదే ఒకపూట కూడా తృప్తిగా తినలేని అభాగ్యుల రుణాల రద్దుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తుంటారు. కేంద్రం తీరు ఎలా ఉందంటే అయినవారికి కంచాల్లో, లేనివారికి ఆకుల్లో అన్నట్లు ఉందని శివాజీ అన్నారు.