ఆంధ్రప్రదేశ్‌

ముందుకు సాగని ‘నగదు రహితం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో లావాదేవీలను పూర్తిగా నగదు రహితం చేయాలన్న ప్రభుత్వం లక్ష్యసాధన ఆచరణలో ముందుకు సాగడం లేదు. దాదాపు ఐదు నెలలుగా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా 25 శాతానికి మించకపోవడం గమనార్హం. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలన్నీ నగదు రహితం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి కనబరిచారు. వివిధ రకాల పరికరాలను, విధానాలను ప్రయోగాత్మకంగా పరిశీలించి, బ్యాంక్‌తో ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా సులువుగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే వీలుందని భావించారు. నగదు రహిత లావాదేవీలు ఎక్కువ చేసేందుకు తీసుకున్న చర్యలు పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఫలితాలిచ్చాయి. అదే సమయంలో రేషన్ దుకాణాల్లో పూర్తిగా నగదు రహితం చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కానీ గత రెండు నెలలుగా రేషన్ దుకాణాల్లో నగదు రహితం మందకొడిగా సాగుతోంది. కృష్ణా జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో ఆశించిన పురోగతి లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో సగటున 13.24 శాతం మేర రేషన్ డిపోల్లో నగదు రహిత లావాదేవీలు జరిగాయి. మార్చిలో ఇప్పటివరకూ రాష్ట్రంలో 25.01 శాతం మేర నగదు రహిత లావాదేవీలే జరిగాయి. కృష్ణా జిల్లాలో 77.77 శాతం మేర నగదు రహితం జరగ్గా, తరువాతి స్థానం 47.06 శాతంతో పశ్చిమ గోదావరి ఉంది. 42.95 శాతంతో తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానంలో ఉంది. గుంటూరు 23.46, చిత్తూరు 22.97, శ్రీకాకుళంలో 17.6, విశాఖపట్నంలో 12.87, కర్నూలులో 12.87, విజయనగరంలో 11.47, కడపలో 10.55, అనంతపురంలో 7.96, నెల్లూరులో 6.13, ప్రకాశం జిల్లాలో 5.91 శాతం మేర నగదు రహిత లావాదేవీలు జరిగాయి. పౌర సరఫరా శాఖ మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో కేవలం 7.96 శాతం మేర మాత్రమే జరగడం గమనార్హం. ఫిబ్రవరితో పోల్చుకుంటే వృద్ధి కనిపించినప్పటికీ, శతం శాతం సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇంకా చాలాదూరంలో ఉంది. డీలర్ల ఖాతాలు, లబ్ధిదారుల ఖాతాలు ఆధార్‌తో బ్యాంక్‌ల్లో లింక్ కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నగదు రహిత లావాదేవీలపై ఎక్కువమంది ఆసక్తి కనబరచడం లేదు. ఒకేసారి అన్ని సరకులు ఇవ్వకపోవడం కూడా ప్రభావం చూపుతోంది. పెరిగిన లావాదేవీలకు అనుగుణంగా సర్వర్ల సామర్థ్యం పెంచకపోవడంతో కనెక్టివిటీ కూడా సమస్యగా మారింది. నగదు రహిత లావాదేవీలు తప్పనిసరి చేస్తూ అధికారులు హడావుడి చేయడంతో లధ్ధిదారుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో నగదు రహితం తప్పనిసరి కాదని, నగదుతో కూడా సరకు కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనికితోడు బ్యాంక్ లావాదేవీలపై సర్వీస్ చార్జీని బ్యాంకులు వడ్డించనున్న నేపథ్యంలో ప్రజలు నగదు లావాదేవీల వైపే మొగ్గుచూపుతున్నారు.