ఆంధ్రప్రదేశ్‌

ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: హిందూ ధార్మిక సంస్థలపై ప్రభుత్వాల పెత్తనం వల్ల హిందూ ధర్మానికి హాని జరుగుతోందని పలువురు హిందూ పీఠాధిపతులు, స్వామీజీలు, హిందూ సేవాసంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం గాంధీనగర్‌లో ‘హిందూ ధర్మం- సవాళ్లు- భవిష్యత్’ అనే అంశంపై రాష్టస్థ్రాయి సదస్సు జరిగింది. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు హిందువులను ఓటుబ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. పవిత్ర కృష్ణా, గోదావరి పుష్కరాలను కూడా తన ప్రచారానికి వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం పుష్కరాల పేరిట సుమారు 4వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా కూలగొట్టిన 46 దేవాలయాలను తిరిగి ప్రభుత్వ ధనంతో పునర్నిర్మించాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
సదస్సులో విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు శివస్వామి మాట్లాడుతూ హిందూ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం పోయిననాడే హిందూ ధర్మం వ్యాప్తి చెందుతుందన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు హిందూ ఆలయాలను కూలగొట్టి మరోవైపు పుష్కరాలను ఘనంగా నిర్వహించినట్లు ప్రచారం చేసుకుందన్నారు. హిందువులంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని, తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, అక్కడ ఇతర మతస్థులు విశ్వవిద్యాలయాలు కడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ముముక్షుజన మహా పీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు మాట్లాడుతూ హిందూ, బౌద్ధ మతాలకు కేంద్రమైన ఘనమైన ప్రాచీన చరిత్ర గల అమరావతికి సింగపూర్ లాంటి దేశాలు ఎలా ఆదర్శవౌతాయని ప్రశ్నించారు. హిందూ మతస్థులు దేశంలోని నదులను పవిత్రంగా భావిస్తున్నారని, అయితే నేటి పాలకులు వీటిని కూడా అపవిత్రం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హరిహర పీఠాధిపతి స్వామి హరేస్వరానంద మాట్లాడుతూ హిందూ ఆలయాల కూల్చివేత రాష్ట్ర ప్రభుత్వ విధానంగా మారిందన్నారు. పుష్కరాల సందర్భంగా కృష్ణానది తీరాన 46 హిందూ ఆలయాలను కూల్చివేశారని, దానికి కారణం అడిగితే అవన్నీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవేనని అధికారులు చెప్పారన్నారు. అయితే కరకట్టపై ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివశిస్తున్న భవనం కూడా నిబంధనలకు విరుద్ధమైనదేనని ఆయన అంటూ దాన్ని కూడా అధికారులు కూల్చగలరా? అని ప్రశ్నించారు. రామానుజ సిద్ధాంత ప్రచార సంఘం కార్యదర్శి డిఎన్‌ఎన్‌వి ప్రసాదబాబు మాట్లాడుతూ కృష్ణా, గోదావరి పుష్కరాల నిర్వహణకు ఖర్చు చేసిన సుమారు 4వేల కోట్ల రూపాయల్లో అత్యధికం దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయని, అందువల్ల ఆ నిధుల వ్యయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇకపై పుష్కరాలను, హిందూ మత సంబంధ ఉత్సవాలను ప్రభుత్వ ప్రమేయం లేకుండా హిందూ సంస్థల ప్రతినిధులతో కూడిన స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని సూచించారు. ప్రముఖ గాయకుడు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమకారుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ దేవాలయాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటిఎంలుగా మారాయని వ్యాఖ్యానించారు. పాలకులు తమ సొంత ప్రచారాలకు దేవాలయ నిధులను విచ్చలవిడిగా వాడుతున్నారని విమర్శించారు. కనకదుర్గ ధర్మ ప్రచార పరిషత్ డైరక్టర్ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని విస్మరించిన పాలకులు, ఆ ధర్మాన్ని అణచివేయడానికి ప్రయత్నించినవారు చరిత్రలో నామరూపాలు లేకుండా పోయారని గుర్తుచేశారు. సదస్సులో చల్లా లక్ష్మీనారాయణ, స్వామి భక్త చైతన్యానంద సరస్వతి, టేకుమళ్ల వెంకటప్పయ్య, గోళ్ల నారాయణరావు, వేమూరి బసవకుటుంబరావు, వెంకట్ పూలబాల, సిహెచ్ మధు, బసవరాజు ప్రసంగించారు.
తీర్మానాల ఆమోదం
ఈసందర్భంగా ఎడిటర్స్ అసోసియేషన్ ప్రవేశపెట్టిన తీర్మానాలను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. హిందూ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని, వాటిని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు నిర్వహించాలని, పుష్కరాలు, పండుగల సందర్భంగా నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు, ఉగాది ఉత్సవాల వంటివాటిని స్వామీజీలు, పీఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులతో కూడిన కమిటీలు నిర్వహించాలని, భారత రాజ్యాంగంలో వ్యక్తికి ఎలాంటి హోదా (పర్సన్ స్టేటస్) ఉందో అలాంటి హోదానే నదులకు కూడా కల్పించి వాటిని కాపాడాలని, పుష్కరాల సందర్భంగా కూల్చిన దేవాలయాలను ప్రభుత్వం తిరిగి నిర్మించాలని సదస్సులో ఏకగ్రీవంగా తీర్మానించారు.

చిత్రం..విజయవాడలో జరిగిన రాష్టస్థ్రాయి సదస్సులో ప్రసంగిస్తున్న ముముక్షుజన మహా పీఠాధిపతులు ముత్తీవి సీతారాం గురుదేవులు