ఆంధ్రప్రదేశ్‌

సార్వత్రిక విద్యా పరీక్షకు 6.67లక్షల మంది హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 19: రాష్ట్రంలో సార్వత్రిక విద్య పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 11 జిల్లాల్లో 6.67 లక్షల మంది ఈ పరీక్షను రాసినట్టు వయోజనవిద్య శాఖ డైరెక్టర్ అమ్మాజీరావు తెలిపారు. ఆదివారం ఆయన జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఏడోదశ ప్రాథమిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని సరాసరి కంటే అధికంగా అక్షరాస్యత ఉన్న తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్కో గ్రామపంచాయతీకి రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించామన్నారు. ఇన్విజిలేటర్లుగా అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, విద్యా వాలంటీర్లు, సిఆర్‌పిలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లను నియమించినట్టు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 65 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 75 వేల మంది వయోజనులు ఈ పరీక్ష రాస్తున్నారని ఆయన తెలిపారు. 85 శాతం మంది మహిళలు ఉన్నారన్నారు. ఆయన వెంట డిడి ఎన్‌విఆర్‌వి కుమార్ తదితరులు పాల్గొన్నారు.