ఆంధ్రప్రదేశ్‌

విచ్ఛిన్న శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 19: దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్రోహ శక్తులు కుయుక్తులు పన్నుతున్నాయని ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఐక్యంగా నిలిచి కేంద్రానికి అండగా నిలవాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆ దేవుని ప్రార్థించానని అన్నారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కార్మికులకు తన వంతు సేవ చేయాలని భావిస్తున్నానని అందుకుతగ్గ శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించానని తెలిపారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోందని ఆయనకు స్వామివారి ఆనుగ్రహం కలగాలని ప్రార్థించానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విచ్ఛినకర శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలవాల్సి ఉందన్నారు.