ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ మార్కెటింగ్ డైరెక్టర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 19: అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఇద్దరు మార్కెటింగ్ డైరెక్టర్లను ఆదివారం నెల్లూరు సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెటింగ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న బెజవాడ వీరవెంకట బాబూరావు, కాజ కిషోర్‌లను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ఒడిస్సా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో సుమారు 32 లక్షల మంది నుంచి రూ.6,380 కోట్ల మేర డిపాజిట్‌లు సేకరించింది. నెల్లూరు జిల్లాలో 1.25 లక్షల మంది నుంచి రూ.264 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు సిఐడి దర్యాప్తులో తేలింది. అనంతరం చెల్లింపులు చేయకుండా బోర్డు తిప్పేయడం, డిపాజిట్‌దారులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడం తదనంతర పరిణామాల్లో కేసు సిఐడికి అప్పగించడం జరిగాయి. దర్యాప్తు చేపట్టిన సిఐడి జిల్లాలో అగ్రిగోల్డ్‌కు చెందిన 2,500 ఎకరాల భూమిని, నగరంలోని సంస్థ కార్యాలయాన్ని ఇప్పటికే జప్తు చేసింది.
ఈ సంస్థలో విజయవాడకు చెందిన బెజవాడ వీరవెంకట బాబూరావు మార్కెటింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తుండగా కాజ కిషోర్ అగ్రిగోల్డ్ నిర్మాణాల విభాగంలో మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉంటూ చెక్కుల చెల్లింపులో ముఖ్యభూమిక పోషిస్తుంటాడు. అగ్రిగోల్డ్ కేసులో 18వ ముద్దాయిగా ఉన్న వీరవెంకట బాబూరావు, 19వ ముద్దాయిగా కాజ కిషోర్‌లు ఇద్దరిపై పూర్తిస్థాయి నిఘా పెట్టిన నెల్లూరు సిఐడి అధికారులు ఆదివారం వారిద్దరిని విజయవాడలో అరెస్ట్ చేసి నెల్లూరుకు తరలించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా ఈనెల 31 వరకు వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో నిందితులను సిఐడి అధికారులు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.