ఆంధ్రప్రదేశ్‌

అనంత కరవుపై కాంగ్రెస్ సత్యాగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: కరవు నివారణకు ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు చేపట్టాలని, ఈ నెల 25న అనంతపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అధ్యక్షతన ఒకరోజు సామూహిక దీక్ష చేపడుతున్నట్లు సీనియర్ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించిన నాడే మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ ఈ విషయం చెప్పారన్నారు. విభజన కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోతుందని నాయకులు, కార్యకర్తలు అధైర్యపడ్డారన్నారు. దురదృష్టవశాత్తూ విభజన పాపం కాంగ్రెస్ మీద పడిందన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోందని, తాగడానికి నీరులేక సాగుకు సరిపడా నీరు దొరక్క రైతులు, ప్రజలు అల్లాడుతున్నారన్నారు. పశువులకు నీరు, ఆహారం దొరక్కపోవడంతో బక్కచిక్కి ఎందుకూ పనికిరాకపోవడంతో కబేళాలకు తరలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామాల్లో వలసలు బాగా ఎక్కువై ఇతర రాష్ట్రాలకు బతుకుతెరువు కోసం వెళుతూ పడరాని పాట్లు పడుతున్నారన్నారు.