ఆంధ్రప్రదేశ్‌

అకాల వర్షాలను తట్టుకునేందుకు ఏపీ ట్రాన్స్‌కో సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 19: ఈ ఏడాది అకాల వర్షాలను ఎదుర్కొనేందుకు ఏపీ ట్రాన్స్‌కో సిద్ధమైంది. ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. తుపానులు, భారీ వర్షాలు, ఈదురుగాలులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకుంటుంది. 2014లో సంభవించిన హుదూద్ వంటి భారీ తుపానుల సమయంలో కూలిన భారీ విద్యుత్ టవర్లతో ఏర్పడిన పరిస్థితులు పునరావృతం కాకుండా కాస్తంత ముందుగానే అమెరికా నుంచి భారీ విద్యుత్ టవర్లను ఇక్కడకు తీసుకురాగలిగింది. దాదాపు 80 కోట్ల వ్యయంతో 30 విద్యుత్ టవర్లు తీసుకురాగా, ఇందులో కడప జిల్లాకు పది, విజయవాడకు మరో పది, విశాఖ జిల్లాకు సంబంధించి ఇంకో పది చేరుకున్నాయి. ఒక్కో విద్యుత్ టవర్‌ను రూ.2.5 కోట్లతో కొనుగోలు చేయగా, ఎటువంటి విపత్తర పరిస్థితులు ఎదురైనా ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగిస్తారు. అవసరమైన చోట్ల వీటిని తాత్కాలిక పద్ధతిలో నిర్మించేందుకు ట్రాన్స్‌కో అన్నివిధాలా రంగం సిద్ధం చేసింది. అమెరికా, కెనడా దేశాల్లోనే తయారయ్యే వీటిని ప్రత్యేకంగా ఇక్కడకు తీసుకువచ్చింది. విశాఖ కలపాక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వీటన్నింటినీ ఏర్పాటు చేసింది. అలాగే 400/132కెవి విద్యుత్ సబ్‌స్టేషన్లలో కాలుష్యంతో పేరుకుపోయిన ఇన్యులేటర్లకు పెయింటింగ్‌లు వేయడం, విద్యుత్ తీగల పటిష్ఠత, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ఈసారి దీనికి భిన్నమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వేసవి ఆరంభంలోనే వాతావరణం చల్లబడగా, గత నెల నుంచి అనేకసార్లు వర్షాలు కురిశాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. వాతావరణ మార్పులతో ఈ వేసవి సీజన్‌లో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనే నిమిత్తం సిద్ధంగా ఉన్నామని ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణమోహన్ ఆదివారం తెలిపారు.