ఆంధ్రప్రదేశ్‌

గెలుపు ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 19 : కడప జిల్లాలో సోమవారం జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల ఫలితాల్లో విజయం ఎవరిని వరిస్తుందోనని స్థానిక నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. నేడు వెలువడనున్న ఫలితం అధికార, ప్రతిపక్ష పార్టీలకు అగ్నిపరీక్ష లాంటిదని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫలితాలపై ఇరుపార్టీల నేతల, రాజకీయ విశే్లషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు సర్వశక్తులు వడ్డి ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో పట్ట్భద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా ఇరుపార్టీల నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రత్యేక దృష్టి సారించి పోలింగ్ ప్రక్రియలో ఎత్తుకు పై ఎత్తులు వేసుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 840 మంది ఓటర్లలో 839 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇరుపార్టీల నేతలు నెల రోజుల పాటు క్యాంపు రాజకీయాలు చేసి వ్యూహాత్మకంగానే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేర్చి పోలింగ్ ప్రక్రియను ముగించారు. ప్రతిపక్ష నేత జగన్ తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని బరిలో దింపి ఆయన్ను గెలిపించుకుని జిల్లాలో తన సత్తాను చాటే దిశగా అడుగులు వేశారు. ఇక అధికార టిడిపి అధిష్ఠానం డైరెక్షన్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి(వాసు)తో పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఎమ్మెల్సీలు టిడిపి అభ్యర్థి బిటెక్ రవి(రవీంద్రారెడ్డి)ని ఎలాగైనా గెలిపిస్తామని అధిష్ఠానానికి భరోసా ఇచ్చి ఆ మేరకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. దీంతో ఇరుపక్షాలకు చెందిన నేతలు కడప, రాజంపేట, జమ్మలమడుగు డివిజన్లలో పాగా వేసి ఎన్నికలను పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారపార్టీ తీరుపై నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు, యాత్రలు చేస్తూ టిడిపి అధిష్ఠానంపై నిప్పులు చెరిగారు. జగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు టిడిపి అధిష్ఠానం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను సవాల్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో జగన్ జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లను సందర్శించి ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు సమాచారం.