ఆంధ్రప్రదేశ్‌

ఉత్తీర్ణులయ్యేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు/నెల్లూరు, మార్చి 19 : తూర్పు రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపును సోమవారం చిత్తూరులోని పివికెఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్నారు. ఈనెల 9న ఈ నియోజకవర్గాల పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు జిల్లాల బ్యాలెట్ బాక్సులను చిత్తూరుకు తరలించారు. పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల వారీగా బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భారీ బందోబస్తు మధ్య భద్రపరిచారు. తూర్పురాయలసీమ పట్ట్భద్రుల నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,18,356 మంది ఓటర్లు ఉండగా అందులో 1.47,753 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. టీచర్ల నియోజకవర్గ పరిధిలో 20,257 మంది ఓటర్లు ఉండగా 17,682 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సోమవారం రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉంది. పట్ట్భద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపుపర్వం మంగళవారం రాత్రికి గాని పూర్తయ్యే అవకాశం లేదు. ఈసారి ఈ ఎన్నికలను పలు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. తొమ్మిదిమంది ఎన్నికల బరిలో నిలిచారు.
ఇందులో స్వతంత్రులుగా ఎస్ ఆనందనాయుడు, చదలవాడ సుచరిత, కృష్ణయ్య, కె వెంకటసుధాకర్‌రెడ్డి, ఎం రామిరెడ్డి, ఎన్ రామయ్య, టిడిపి మద్దతుదారుడిగా ఎ వాసుదేవనాయుడు, పిడిఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా అంబూరి సుబ్రహ్మణ్యం తుది పోరులో నిలిచారు. ప్రధానంగా టిడిపి, పిడిఎఫ్ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొంది. కాంగ్రెస్ మద్దతుదారుడైన ఏలూరి రామచంద్రారెడ్డి, టిటిపికి చెందిన వి పట్ట్భారామిరెడ్డి, పిడిఎఫ్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, న్నారపు మస్తాన్‌రావు (బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్), కిరణ్‌కుమార్‌యాదవ్ (ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి) స్వతంత్రులైన డాక్టర్ సుభాష్‌రాజు, పి వెంకటరమణ, ఎన్ నాగబ్రహ్మానందాచ్చారి, సి కోటేశ్వరరావు, కడియం రామయ్యయాదవ్, కె నారాయణరెడ్డి, సోమిరెడ్డి, ఎన్ కరీముల్లా, ఎం రాజేస్ రాయల్ తలపడ్డారు. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్న స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో తలపడిన అభ్యర్థుల భవిత సోమవారం బహిర్గతం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు.