ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా-పెన్నా అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 19: కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో బుగ్గవాగు ఆధునీకరణ పనులపై అధికారులతో సమీక్షించిన మంత్రి ఆదివారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీతో నీరు అందిస్తామని చెప్పారు. 2019 సంవత్సరానికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం తగిన నిధులు మంజూరు చేస్తోందన్నారు. పనులు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. నదుల అనుసంధానంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలను సస్యశ్యామలం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. అనంతపురం జిల్లా పెనుకొండలో 50వేల మందికి తాగునీరు అందించే పథకాన్ని వచ్చేనెలలో ప్రారంభిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తుంటే జగన్ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్ నుండి ఊహించిన స్థాయిలో నీరు విడుదల కావడం లేదన్నారు. తెలంగాణ అభ్యంతరాల వల్ల తక్కువ నీరు అందుతోందన్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న నీటితో పంటలను కాపాడుతూ ప్రజలకు మంచినీరు అందిస్తున్నామని వివరించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరందించే బుగ్గవాగు నిర్మాణ సమయంలో 3.5 టిఎంసిల సామర్థ్యం ఉండేదని, ఇది క్రమంగా 1.5 టిఎంసిలకు తగ్గిందన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దేవినేని ఉమ