ఆంధ్రప్రదేశ్‌

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విఠపు గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 20: తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిడిఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం విజయం సాధించారు. చిత్తూరులో తూర్పు రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 9 మంది అభ్యర్థులు ఎన్నికల బరి లో నిలవగా ప్రధానంగా పిడిఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం, టిడిపి అభ్యర్థి వాసుదేవనాయుడుల మధ్యనే పోటి నెలకొంది. ఇందులో మొదటి ప్రాధ్యానత ఓట్లలో స్పష్టమైన కోటా ఎవరికీ లభించక పోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమయ్యాయి. దీంతో రెండవ ప్రాధాన్య ఓట్లతో విఠపు బాలసుబ్రమణ్యం విజయం సాధించారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గాంలో మొత్తం 20.257 ఓట్లు ఉండగా, అందులో 17.015 ఓట్లు పోలైయ్యాయి. ఇందులో 537 ఓట్ల చెల్లనవిగా అధికారులు నిర్థారించారు. ఆందులో మొద టి ప్రాధాన్యత కోటా కింద 8508 ఓట్లు రావా ల్సి ఉంది, ఇందులో విఠపు బాలసుబ్రమణ్యంకు మొదటి ప్రాధాన్యతలో 7812 ఓట్లు , వాసుదేవ నాయుడుకు 4522 ఓట్లు వచ్చా యి. దీంతో ఇరువురికి స్పష్టమైన కోటా రాక పోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. దీంతో పోటిలో ఉన్న ఆరుగురు అభ్యర్థులు ఎలిమినేట్ తరువాత విఠపు బాలసుబ్రణ్యం రెండవ ప్రాధాన్యతో 8861 ఓట్లను సాధించి కోటాను దాటడంతో విజయం వరించింది. టిడిపి అభ్యర్థి వాసుదేవ నాయుడు రెండవ ప్రాధాన్యతో 4236 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. విఠపుబాలసుబ్రమణ్యంకు వరుసగా ఇది మూడవ విజయం, 2007 తొలిసారిగా ఆయన యుటిఎఫ్ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందగా, అనంతరం 2011లో జరిగిన ఎన్నికల్లోను విజయం సాధించారు. ఈసారి విజయంతో హ్యట్రిక్ సాధించారు. అయితే పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టిడిపి అభ్యర్థి పట్ట్భారామిరెడ్డి పిడిఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసుల రెడ్డి మధ్య హోరా హోరి పోటీ కొనసాగుతోంది. ఈ ఓట్లు లెక్కింపు మంగళవారం రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.

చిత్రం..విఠపు బాలసుబ్రమణ్యం