ఆంధ్రప్రదేశ్‌

మీ ఆటలు సాగనివ్వను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 20: ‘హౌస్‌లో ఓ పద్దతిలేకుండా పోయింది.. వీళ్లకు రాజకీయం కావాలి.. ప్రజలు ఇబ్బందిపడాలి.. తిన్నింటి వాసాలు లెక్కేసే వాళ్లకు నిజాలేం తెలుస్తాయి.. ఇకపై అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతా.. అలగాజనం మాదిరి తయారయ్యారు.. శాసనసభలో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రివిలేజెస్ మోషన్‌కు వెళతాం.. ఆపై బాధ్యత వహించాల్సింది మీరే’.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ప్రతిపక్ష నేత జగన్ లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సుమారు రెండున్నర గంటల పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విశదీకరించారు. ఈసందర్భంగా ఆయన ఆవేశంగా ప్రసంగిస్తూ ‘నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను.. నా శీలాన్ని శంకించాల్సిన అవసరం లేదు’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలనేది ప్రభుత్వ సంకల్పంగా చెప్పారు. ఇందులోభాగంగా ప్రతి కుటుంబానికి 15 సూత్రాలతో పాటు 7 మిషన్లు, ఐదు గ్రిడ్లు, మరో ఐదు క్యాంపెయినింగ్ మోడ్‌లతో సమాజ వికాసానికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రతిఫలం ఆశించే దిశగా రెండంకెల వృద్ధిరేటు సాధన కోసం నిత్యనూతన అనే్వషణలు, నైపుణ్యత, ఉపాధికల్పన, పారిశ్రామికీకరణ, తదితర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. బస్సు నుంచి పాలన మొదలుపెట్టి ప్రపంచంలోనే ఐదో నగరంగా అమరావతిని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని, అడ్డదారిలో వెళ్లే దుర్మార్గులకు ఇది అర్థం కాదన్నారు. వైఎస్ హయాంలో రూ. 4500 కోట్లతో నిర్మించిన ఇళ్లు మచ్చుకైనా కనిపించటంలేదని విమర్శించారు. దయ్యాలు, మగవాళ్లు వితంతు పెన్షన్లు కాజేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుతగులుతూ ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వైసిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేస్తున్న సమయంలో సిఎం మరింత ఆగ్రహంతో ‘మీ నాయకుడి వెంట ఉండటానికి సిగ్గుపడాలి.. వీళ్లుచేసే తప్పుడు పనులకు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.. ఆ ప్రభావం ప్రజలపై పడుతోంద’ని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సభలో హుందాగా సూచనలు, సలహాలివ్వాల్సిన ప్రతిపక్షం అవగాహనా రాహిత్యంతో వ్యవహరించడం దౌర్భాగ్యమన్నారు. దారినపోయేవారు సలహా ఇచ్చినా అభివృద్ధికి స్వీకరిస్తామని స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఇటలీ ఆవిర్భావ దినోత్సవం రోజునే రాష్ట్రాన్ని విభజించారని, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. ఈవిషయంలో ఎవరైనా అవరోధాలు కల్పిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. అవసరమైతే రౌడీయిజంపై కూడా దండయాత్ర చేస్తామని, నేరస్థులకు ఇక చెల్లుచీటి ఇస్తామని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.