ఆంధ్రప్రదేశ్‌

రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే శివాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, మార్చి 20: పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ రోడ్డుపై బైఠాయించి హడావుడి సృష్టించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరవటానికి ఎమ్మెల్యే శివాజీ ప్రకాశం బ్యారేజ్ మీదుగా కరకట్టపై వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లటానికి ప్రయత్నించారు. అప్పటికే సిఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేసిన పోలీసులు కరకట్ట మార్గంలో శివాజీ వెళ్లటానికి అనుమతించలేదు. దీంతో ఆయన మెయిన్ రోడ్డుపై ముందుకు వచ్చి బకింగ్‌హాం కెనాల్‌పై ఉన్న హెడ్ రెగ్యులేటరీ వద్ద పిడబ్యుడి వర్కుషాపు రోడ్డులోకి తన కారు పోనివ్వటానికి యత్నించారు. అక్కడ కూడా ఆయనను పోలీసులు అడ్డుకుని కరకట్ట మార్గం కేవలం ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులకు కేటాయించారని, ఎమ్మెల్యేలు ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం మార్గంలో సచివాలయానికి వెళ్లాలని నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. తనను పోలీసులు అడ్డుకోవటం సరికాదంటూ ఆయన రోడ్డుపై బైఠాయించారు. దీంతో సీతానగరంలో ఒక్కసారిగా ఉద్రికత్త నెలకొంది. మెయిన్‌రోడ్డుపై అటు ప్రకాశం బ్యారేజ్‌పై, ఇటు ఉండవల్లి సెంటర్ వైపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే శివాజీకి నచ్చచెప్పి ఉండవల్లి మార్గంలో వెళ్లాలని కోరారు. ఆయన ఎంతకీ వినకపోవటంతో సమీపంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో సిఎం కాన్వాయ్ వెళ్లిపోవటంతో పోలీసులు శివాజీని ఉండవల్లి మార్గంలో వెళ్లాలని కోరారు.

చిత్రం..పోలీసులు అడ్డుకున్నారని కృష్ణా కరకట్టపై రోడ్డు మీద బైఠాయించిన పలాస ఎమ్మెల్యే శివాజీ