ఆంధ్రప్రదేశ్‌

ప్రశ్నోత్తరాల్లో రెండుసార్లు సభ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: అరుపులు, కేకలు, ప్లకార్డులతో నిరసనలు, బైఠాయింపుల మధ్య శాసనసభ మంగళవారం దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలు సభలో ప్రస్తావనకు రావాల్సి వుండగా రెండే రెండు ప్రశ్నలు చర్చకు వచ్చాయి. గందరగోళం మధ్య సభ రెండుసార్లు వాయిదా పడింది. సభా ప్రారంభంలోనే రభస చోటుచేసుకుంది. కరవుపై చర్చించేందుకు తమ వాయిదా తీర్మానాన్ని అనుమతించాలంటూ వైకాపా సభ్యులు ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. ఆయితే దీనికి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఏమాత్రం అంగీకరించలేదు. తర్వాత చర్చిద్దామంటూ సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దీనికి అంగీకరించని వైకాపా సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా స్పీకర్ అసహనంతో సభను వాయిదా వేశారు. తర్వాత మహిళలపై అత్యాచారాల పట్ల చర్చలో పలు అంశాలను ప్రస్తావించడానికి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వైకాపా సభ్యులు స్పీకర్ పోడియం వైపు చొచ్చుకెళ్లారు. ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘మాకు సమయం ఇవ్వకపోవటం అన్యాయం, దుర్మార్గం, మోసం, దగా. మాగొంతు నొక్కుతున్నారం’టూ నినదించారు. ఒకదశలో స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్పీకర్ రెండోమారు కూడా సభను వాయిదా వేశారు. ఒక సందర్భంలో బిజెపి పక్ష నేత విష్ణుకుమార్ రాజు మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి ప్రతిపక్ష నేత జగన్‌ను నువ్వు.. నువ్వు అనటం సభా మర్యాదకాదన్నప్పుడు టిడిపి సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. పార్టీ మారారా? అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. దీనిపై ఆయన బదులిస్తూ వైకాపా సభ్యుల వరసలలోనే తనకు సీటు కేటాయించినప్పుడు కూడా పలువురు ఇదే వ్యాఖ్య చేశారంటూ నవ్వుతూ చెప్పారు.