ఆంధ్రప్రదేశ్‌

గల్ఫ్‌లోని తెలుగువారిని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకోవాలని పలువురు సభ్యులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసన మండలిలో మంగళవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో సౌదీ అరేబియాలో తగిన ఆదాయ వనరులు లేక రాష్ట్రానికి తిరిగి రాలేకపోతున్న వారి గురించి తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి ప్రశ్నించారు. సౌదీలో దాదాపు 10 వేల మంది చిక్కుకుపోయారని, 6 నెలలుగా జీతాలు లేవని, 3170 మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మాట్లాడుతూ అక్కడి జైళ్లలో ఎంతమంది ఉన్నారని, అక్కడి తెలుగు సంఘాలతో సమన్వయం చేసుకునేందుకు ఏర్పాట్లు ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందిస్తూ ఇరాక్, గల్ఫ్, తదితర దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని రాష్ట్రానికి తరలించామన్నారు. గల్ఫ్ నుంచి 43 మందిని స్వస్థలాలకు తరలించామని వివరించారు. అనధికార ఏజంట్ల ద్వారా వెళ్లిన వారి వివరాలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద ఉండవని తెలిపారు.
కౌలురైతులకు పొదుపు, తద్వార రుణం పొందేందుకు వీలుగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇప్పటికే 1070 సంఘాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్ర స్థాయిలో కనీస మద్దతు ధర నిర్ణయించే కమిటీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే అంశం కేంద్ర కమిటీల సమావేశంలో ప్రస్తావించాలని మంత్రికి సూచించారు.
విమానాశ్రయాల పేర్ల
మార్పుకు తీర్మానం
తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల పేర్లను మార్చేందుకు శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. విజయవాడ విమానాశ్రయాన్ని నందమూరి తారకరామారావు విమానాశ్రయం-అమరావతిగా, తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వేంకటేశ్వర విమానాశ్రయంగా పేర్లు మార్చేందుకు తీర్మానించారు.