ఆంధ్రప్రదేశ్‌

అనూహ్యం..ఆ ముగ్గురి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 21: రాష్ట్రంలో బిజెపి పూర్తిగా కునారిల్లిపోయిన రోజులు.. మోదీ క్రేజ్‌తో మళ్లీ జీవం పోసుకున్న పరిస్థితులవి. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖలో బిజెపి దాదాపు అథమ స్థితిలో ఉంది. మోదీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి రాక ముందు విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు, విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి బిజెపి తరపున అభ్యర్థులు లేని పరిస్థితులు. మోదీ ఎన్నికల బరిలోకి రావడంతో ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయి. బిజెపి శ్రేణుల్లో గెలుపు ధీమా వచ్చింది. ఆనాటి ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానానికి వైకాపా తరపున విజయమ్మ పోటీకి దిగుతారన్న విషయం తెలియడంతో, టిడిపి తెలివిగా ఈ సీటుని బిజెపికి కేటాయించింది. విజయమ్మ మీద పోటీ చేస్తే, ఏమవుతుందోనన్న భయం బిజెపికి లేకపోలేదు. ఏదైతేనేం..లోక్‌సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా కంభంపాటి హరిబాబును రంగంలోకి దించారు. అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని కూడా తెలుగుదేశం పార్టీ బిజెపికి వదిలేసింది. ఆఖరి క్షణంలో విష్ణుకుమార్ రాజును బరిలోకి దించారు. విశాఖ లోక్ సభ స్థానం నుంచి విజయమ్మ గెలుస్తారు. మెజార్టీ ఎంత అన్నదే తేలాలని వైకాపా నాయకులు భావిస్తున్న సమయంలో హరిబాబు అనూహ్య విజయాన్ని కైవసం చేసుకున్నారు. విజయమ్మపై విజయం సాధించి హరిబాబు సంచలనం సృష్టించారు. అలాగే, ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విష్ణుకుమార్ రాజు రాజకీయాలకు పూర్తిగా కొత్త. అయినా, మోదీ ఇమేజ్‌తో వైకాపాపై గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గంలో మాధవ్ విజయం కూడా అటువంటిదే. నామినేషన్ దాఖలు చేయడానికి సమయం మించిపోతున్న తరుణంలో టిడిపి సీటును బిజెపికి కేటాయించింది. దీంతో హడావుడిగా నామినేషన్ దాఖలు చేసి, కేవలం పది రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొని, ఘనమైన విజయాన్ని మాధవ్ చేజిక్కించుకున్నారు. ఒకే లోక్ సభ నియోజకవర్గంలో ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుకోని విజయాలను నమోదు చేసుకుని బిజెపి సరికొత్త రికార్డును సృష్టించింది.