ఆంధ్రప్రదేశ్‌

సాగునీటి రంగానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: రాష్ట్రంలో సాగునీటి రంగానికి పెద్దపీట వేశామని, గడచిన మూడేళ్లలో రూ. 21వేల 632కోట్లు ఖర్చుచేశామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేయడమే కాకుండా 2018 నాటికి పోలవరం నిర్మాణాన్ని సైతం పూర్తిచేస్తామంటూ ప్రకటించారు. జగన్ ఎంపీగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్నప్పటికీ నీరు అందించలేని కడప జిల్లాకు అందునా పులివెందులకు నీటిని అందించిన ఘనత చంద్రబాబుకు, టిడిపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఆ సమయంలో టిడిపి సభ్యులు బల్లలు చరచగా వైకాపా సభ్యులు ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ శ్రీశైలం వద్ద 814 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ రాయలసీమకు సాగునీరందించలేని దుస్థితి నెలకొందన్నారు. పట్టిసీమ మోటార్ల ద్వారా ఎత్తిపోయించిన నీటిని నిలువ చేసుకోలేక 40 టిఎంసిలకు పైగా సముద్రంలోకి వదలడం వల్ల విద్యుత్ చార్జీల కింద రూ.140 కోట్లు భరించాల్సి వచ్చిందన్నారు. వైకాపా సభ్యులు పలువురు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా మంత్రి ఉమామహేశ్వరరావు నాడు ఎంత ఆందోళన చేశారో తెలియంది కాదన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సిఎం చంద్రబాబు ఆశయాల మేరకు ప్రతి నీటిచుక్కను జాగ్రత్త చేసుకోటానికి కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరారు.