ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. తహశీల్దార్ వనజాక్షి పైనే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేస్తే ఇక సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందం’టూ వైకాపా సభ్యురాలు గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఈశ్వరి, గౌరు చరితారెడ్డి, వి కళావతి, పాముల పుష్పశ్రావణి రాష్ట్రంలో ఇటీవల మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయంటూ ఆందోళన వ్యక్తపర్చారు. దీనిపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత బదులిస్తూ మహిళలకు రక్షణ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈవిషయంలో ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉందన్నారు. అన్ని జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మహిళలపై జరిగిన అమానుష నేరాలపై విచారిస్తున్నాయని చెప్పారు. నిర్భయ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తున్నామన్నారు. అయితే వైకాపా సభ్యురాలు ఈశ్వరి మంత్రి సమాధానంతో ఏకీభవించలేదు. రిషితేశ్వరి కేసులో నేరస్తులు తప్పించుకు తిరుగుతున్నారన్నారు.
మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు, తాజాగా గుంటూరు జిల్లాలో బాలికపై అత్యాచారం, గిరిజన మహిళా సర్పంచ్‌పై దాడి జరిగాయంటూ ఉదహరించారు. దీనిపై టిడిపి సభ్యురాలు అనిత మాట్లాడుతూ రిషితేశ్వరి తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కృతజ్ఞతలు తెలిపారని, కేసు విచారణపై వారిలో సంతృప్తి కన్పించిందికదా అన్నారు. అన్నీ వక్రీకరించడం వైకాపా సభ్యులకు పరిపాటి అని విమర్శించారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించటాన్ని ఓర్వలేక స్పీకర్ కోడెల వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేశారన్నారు. చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఇసుక క్వారీల వద్ద తన పైనే దాడి జరిగిందని, దీనిపై అన్నిస్థాయిల్లోనూ విచారణ జరిగిందన్నారు. ఇంకా ఏమైనా అనుమానాలుంటే అసలు తాను ఎలాంటి వ్యక్తినో తెలుసుకోటానికి సభా సంఘం ఏర్పాటుచేసి తన నియోజకవర్గానికి పంపించాలని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే వైకాపా సభ్యులు ఎవరైనా రావచ్చన్నారు. దీనిపై మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ వైకాపా సభ్యులు పలువురు లేచి నిలబడగా స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వారు పోడియం వద్ద బైఠాయించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పీకర్ కోడలి గురించి మాట్లాడండి అంటూ తమ పార్టీ మహిళా సభ్యులకు సూచించారు. కొంతసేపు రభస చోటుచేసుకోగా స్పీకర్ సభను వాయిదా వేశారు.