ఆంధ్రప్రదేశ్‌

టిడిపి అభ్యర్థిని ముంచిన చెల్లని ఓట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 21: తూర్పు రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి విజయాన్ని చెల్లని ఓట్లు గండి కొట్టాయి. ఈనియోజక వర్గ పరిధిలో 14,551 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు. అందులో ఎక్కువగా టిడిపి అభ్యర్థికి చెందినవే ఉన్నట్లుగా సమాచారం . ఈఎన్నికల్లో మొత్తం 2,18.356 ఓట్లకు గాను పోలైంది 1,47,753, అందులో 14,551 ఓట్లను చెల్లనివిగా అధికారులు నిర్థారించారు. మిగిలిన 1,33,202 ఓట్లలో కోటాగా 66,602 ఓట్లుగా నిర్ణయించారు. ఇందులో పిడిఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసుల రెడ్డికి తొలి ప్రాధాన్యతలో 64.388 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్థికి 61, 234 ఓట్లు వచ్చాయి. అయితే చెల్లని ఓట్లల్లో సుమారు తొమ్మిది వేల వరకు టిడిపి అభ్యర్థికి చెందినవే ఉన్నట్లు తెలిసింది. వాస్తవంగా ఈ ఓట్లు సక్రమంగా ఉండి ఉంటే టిడిపి అభ్యర్థి వేమి రెడ్డి పట్ట్భారామి రెడ్డి తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఘన విజయం సాధించే అవకాశం ఉండేది. దీంతో చేతులారా అధికార పార్టీ విజయాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో పట్ట్భద్రులు, ఉపాధ్యాయులే ఓటర్లుగా ఉన్నా ఓటింగ్ విధానంలో అవగాహన లేక పోవడంతో భారీ సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో 14 మంది అభ్యర్థులు పోటీ చేయగా ప్రధానంగా పిడిఎఫ్ - టిడిపి అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొంది. మిగిలిన అభ్యర్థులైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏలూరి రామచంద్రారెడ్డికి 3025 ఓట్లు , కిరణ్ కుమార్ యాదవ్ ( అంధ్రరాష్ట్ర ప్రజాసమితి ) 866, స్వతంత్రులైన రాజేష్ రాయల్‌కు 265, సోమిరెడ్డి 155, రామయ్య యాదవ్ 377, కరీముల్లా 316, కె నారాయణ రెడ్డికి 183, కోటేశ్వరరావు134, డి ,మస్తాన్ రావు 821, వెంకటరమణకు 1081, నాగబ్రహ్మనందాచ్చారి 251, సుభారాజ్ కు 741 ఓట్లు వచ్చాయి.