ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రి సవాల్‌ను జగన్ స్వీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: శాసనసభలో అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై విక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని, ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్‌ను జగన్ స్వీకరించి తన నిజాయితీని నిరూపించుకోవాలని పలువురు టిడిపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పాయకారావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్ వర్మ, ఎమ్మెల్సీ మీసాల గీత మాట్లాడుతూ మంత్రి ప్రత్తిపాటిపై విపక్షనేత జగన్ చేసిన ఆరోపణలపై హౌస్ కమిటీ, జ్యుడిషియల్ విచారణ వేసేందుకు తాము సిద్ధమేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా జగన్ నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, వారంతా సభ వెలుపలికి వెళ్లిపోవడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యాఖ్యలను జగన్ మీడియా వక్రీకరించి ప్రసారం చేసిందని ఆరోపించారు. దీనిపై జగన్ స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిఎం సవాల్‌కు బదులిద్దామన్నా మైకు ఇవ్వలేదు శాసనసభలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్‌కు బదులిస్తామని, తమకు మైక్ ఇవ్వాలని ఎంతగా బతిమిలాడినా, అరిచిగీపెట్టినా స్పందించక పోవడంతోనే తాము బయటికి రావాల్సి వచ్చిందని, విపక్ష వైసిపి ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు గడికోట, చెవిరెడ్డిలు మాట్లాడుతూ 8 రాష్ట్రాల్లో 30 లక్షల మందికి అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, మన రాష్ట్రంలో 19 లక్షల మంది ఉండగా వారికి న్యాయం చేయాలని వైఎర్‌ఆర్ సిపి డిమాండ్ చేసిందని తెలిపారు. ఈ సమయంలో తమ నేత జగన్మోహనరెడ్డి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య పేరిట అగ్రిగోల్డ్ ఆస్తులు కొనుగోలు చేశారని అంటుండగానే మైక్ కట్ చేయడంతో పాటు అధికారపక్ష ఎమ్మెల్యేలు తొడలు కొట్టిమరీ సవాళ్లు విసిరారని అన్నారు. తాము సవాల్‌కు సిద్ధమని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేసేందుకు మైక్ ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. తమ బండారం బయటపడుతుందనే భయంతోనే సభకు సంబంధం లేని అంశాలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.