ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ‘హై’వే డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 24: విశాఖలో ఏది నేషనల్ హైవేనో, ఏది స్టేట్ హైవేనో అన్న అంశంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టత లేకుండాపోయింది. నేషనల్ హైవే, స్టేట్ హైవేలను ఆనుకుని 500 మీటర్ల లోపు ఉన్న మద్యం దుకాణాలను, బార్లను తొలగించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వీటిని ఈ నెల 31లోగా వీటిని తొలగించాల్సి ఉంది. అయితే, విశాఖ జిల్లాలో నేషనల్ హైవే ఏది? స్టేట్ హైవే ఏది అన్నది తేల్చలేక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఎక్సైజ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే విశాఖ నగరం నుంచి వెళ్తున్న నేషనల్ హైవేని ఆనుకుని ఉన్న మద్యం దుకాణాలను, బార్లను తొలగించాల్సిందిగా ఎక్సైజ్ అధికారులు ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకూ ఉన్న ప్రస్తుత హైవే, హైవేనే కాదని పేర్కొంటూ మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకున్నారు.
కోల్‌కత్తా-చెన్నై నేషనల్ హైవే-16 విశాఖ నగరంలో నుంచి వెళుతుంది. ఇప్పటి వరకు దీనినే నేషనల్ హైవేగా పరిగణిస్తున్నారు. కాగా, విశాఖ నగర శివారులోని ఆనందపురం-పెందుర్తి-సబ్బవరం-అనకాపల్లిని నేషనల్ హైవే-16గా నిర్ణయిస్తూ, గజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, విశాఖ నగరంలో నుంచి వెళ్తున్న నేషనల్ హైవేని డీ-నోటిఫైడ్ చేయలేదని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పి.డి. కొద్ది రోజుల కిందటే ధ్రువీకరించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేషనల్ హైవే, స్టేట్ హైవే మీద ఉన్న మద్యం దుకాణాలకు నోటీసులు జారీ చేయాల్సి ఉండడంతో ఎక్సైజ్ అధికారులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియ పిడిని సంప్రదించారు. ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లిని నేషనల్ హైవేగా గుర్తించినట్టు ఈ ఏడాది జనవరి 18న లిఖితపూర్వకంగా ఎక్సైజ్ అధికారులకు తెలియచేశారు. అయితే, అదే నెల 31న నేషనల్ హైవే అథారిటీ పి.డి ఎక్సైజ్ అధికారులకు ఇచ్చిన మరో లేఖలో ఆనందపురం-విశాఖ సిటీ-అనకాపల్లి రహదారి జాతీయ రహదారిగా పేర్కొన్నారు. దీంతో ఎక్సైజ్ అధికారులు విశాఖ నగరం మీదుగా వెళుతున్న జాతీయ రహదారిపై ఉన్న 38 మద్యం దుకాణాలను తొలగించాల్సిందిగా దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన నోటీసులపై యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో ఈనెల 21న హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే వచ్చింది కనుక ఈ మద్యం దుకాణాల జోలికి ఎక్సైజ్ అధికారులు వెళ్లడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు, మద్యం వ్యాపారులంతా కలిసి హైవే డ్రామాను రక్తికట్టించి, సుప్రీం కోర్టు ఆదేశాలను వీరు ఏవిధంగా పక్కతోవ పట్టించారో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క జిల్లా వ్యాప్తంగా 193 దుకాణాలకు నోటీసులు జారీ చేసినట్టు ఎక్సైజ్ డిసి గోపాలకృష్ణ తెలియచేశారు.