ఆంధ్రప్రదేశ్‌

మలుపుతిరిగిన ‘ట్రైమాక్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 20: శ్రీకాకుళం జిల్లాలోని ఈస్ట్‌వెస్ట్ మినరల్ శాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ట్రైమాక్స్) వ్యవహారం అనూహ్య మలుపుతిరిగింది. ట్రైమాక్స్‌లో అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్ విభాగం నివేదికలు ఇవ్వడంతో ప్రభుత్వం తాత్కాలికంగా అనుమతి రద్దుచేసింది. ఈ క్రమంలో చినబాబు లోకేష్ ట్రైమాక్స్ వ్యవహారంలో జోక్యం చేసుకుని నివేదిక కోరినట్లు సమాచారం. కలెక్టర్ ట్రైమాక్స్ రికార్డులను పరిశీలించి నివేదిక పంపేపనిలో ఉన్నారు. ఇదే క్రమంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి చక్రం తిప్పారని వినికిడి. సముద్రతీరంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న ఈస్ట్‌వెస్ట్ మినరల్ శాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ట్రైమాక్స్) సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు తేల్చడంతో తాత్కాలిక నిలుపుదలకు టిడిపి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 387 ఎకరాల వివాదాస్పద భూమిలో సుమారు రూ. 1300 కోట్ల విలువచేసే 17.68 లక్షల టన్నుల ఖనిజాన్ని ట్రైమాక్స్ కంపెనీ వెలికితీసిందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు ప్రభుత్వానికి నివేదిక అందించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు నివేదికలు, శాసనసభా ప్రజాపద్దుల కమిటీ విచారణ, స్థానికుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు వెరసి ప్రభుత్వం బీచ్‌శాండ్ తవ్వకాలు నిలిపివేయాలంటూ కొద్దిరోజుల క్రితం ట్రైమాక్స్‌కు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే జనవరిలో విశాఖపట్నంలో పెట్టుబడులు భాగస్వామ్యం కోసం సిఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన సదస్సులో ట్రైమెక్స్‌తో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కళింగపట్నం, భావనపాడు ప్రాంతాల్లో బీచ్‌శాండ్ తవ్వకాలకు సంబంధించి రూ. 2.500 కోట్లకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కార్యాచరణ దాల్చాలంటే నిజాయితీ వ్యాపారసంస్థ ట్రైమాక్స్ కంపెనీ అని ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది. ఇదే జరిగితే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు నివేదికలకు నీళ్లు వదలడమేగాకుండా ప్రజాపద్దుల కమిటీ విచారణను సైతం గాలికివదిలేసినట్లు అవుతుంది. లేదా నివేదికలు, విచారణలు, ఫిర్యాదుల ఆధారంగా అక్రమ వ్యాపార సంస్థగా ముద్రవేస్తే కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందం రద్దుకావడమే కాకుండా కంపెనీతో పాటు వివిధ విభాగాల అధికారులను బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాక అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మొత్తాన్ని తిరిగి రాబట్టాల్సి ఉంటుంది. ఇదంతా జరిగే పనికాదు కాబట్టి ప్రభుత్వం గుట్టుగా కంపెనీలో భాగస్వామ్యానికై లాబీయింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ కంపెనీ వ్యవహారమై కేంద్రమంత్రి సుజనాచౌదరి ఆర్థిక ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.