ఆంధ్రప్రదేశ్‌

ట్రెజరీల్లో విప్లవాత్మక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: ప్రభుత్వం ప్రజల ధనానికి జవాబుదారీగా ఉండాల్సిన ట్రెజరీ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు జోరందుకుంటున్నాయనే సాకుతో ఆ శాఖ ఉన్నతాధికారులు బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న విధులు, బాధ్యతలను దశల వారీగా దూరం చేసుకోటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ బిల్లులు చెల్లించే విధానానికి స్వస్తి పలుకాలని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తిగా బ్యాంక్‌లకు అప్పగించన ప్రతిపాదనను ఖరారు చేసేందుకై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా బ్రిటీష్ కాలం నుంచి కూడా పెన్షనర్‌లు ఏడాది కోసారి సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో కనబడి గెజిటెర్ అధికారి సంతకంతో తాను జీవించి ఉన్నట్లుగా లైఫ్ సర్ట్ఫికెట్ అందచేయాల్సి ఉంది. ఇక 70 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్‌లో 15 శాతం, 80 ఏళ్ళు దాటిన వారికి మరో 15 శాతం పెంచాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో స్థిరబడిన పెన్షనర్‌ల కోసం ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒక వెసులుబాటు తీసుకువచ్చింది. వారు కార్యాలయాలు రాకుండానే నేరుగా అక్కడ నుంచి గెలిటెడ్ అధికారి ధృవీకరణ పత్రాన్ని పంపిస్తే నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే పెన్షన్ సొమ్ము జమ అవుతూ వస్తున్నది. అయితే పెన్షనర్‌లు మరణించినప్పటికీ వారి వారసులు కొందరు ఆ విషయాన్ని తెలియపరచుకుండా నకిలీ పత్రాలను పంపిస్తూ ఎంచక్కా పెన్షన్ సొమ్మును అనుభవిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలలో భాగంగా రెండేళ్ల క్రితం కార్పొరేట్, నేషనల్ బ్యాంకింగ్ సర్వీసును కార్యరూపంలోకి తీసుకవచ్చింది. ట్రెజరీల నుంచి వెళ్లిన బిల్లులకు బ్యాంక్‌లు ఆమోదముద్ర వేస్తూ సంబంధిత సొమ్మును వ్యక్తుల ఖాతాలకు కాకుండా ట్రెజరీ అధికారుల ఖాతాలకు జమ చేయటం జరుగుతున్నది. అయితే పలు కార్యాలయాల్లో సిబ్బంది అధికారులతో కుమ్మక్కయి లేదా పాస్‌వర్డ్‌ను గుర్తించి ప్రభుత్వ శాఖల సొమ్మును తమ బినామీ బ్యాంక్ ఖాతాలకు జమ చేసుకోవటం ప్రారంభించారు. ఇలా ఒక్క తెనాలిలోనే ఒక, కోటి, 30 లక్షల రూపాయలు తరలింపు జరుగ్గా వివధ జిల్లాల్లో ఇలా కోట్లాది రూపాయల చోరీ జరిగింది. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని చోట్ల సిబ్బంది మరో అడుగుముందుకేసి మరణించిన పెన్షనర్‌ల పెన్షన్ సొమ్ము కూడా బినామీ బ్యాంక్ ఖాతాలకు తరలి వెళుతున్నాయనే ఆరోపణల మధ్య ఈ ప్రక్రియను పూర్తిగా బ్యాంక్‌లకు అప్పగించాలనే ఆలోచన జరుగుతున్నది. వాస్తవానికి ఇప్పటికే స్టాంప్‌ల కుంభకోణంతో స్టాంప్‌ల అమ్మకాలను తొలగించారు. ఆ సమయంలో ఒక్క సబ్ ట్రెజరీలలోనే కనీసం వందకోట్లు విలువైన స్టాంప్‌లు ఉండేవి. ఆ తర్వాత ప్రశ్నపత్రాలను పోలీసు స్టేషన్‌లకు తరలించారు. తాజాగా పెన్షన్ చెల్లింపులను దూరం చేసే ఆలోచన జరుగుతున్నది. అయినప్పటికీ సబ్ ట్రెజరీలలో మూడు షిప్టులలో మాత్రం పోలీసు బందోబస్తు కొనసాగుతున్నది.