ఆంధ్రప్రదేశ్‌

హైడ్రామా మధ్య అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, (పటమట) మార్చి 27: రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టిడిపి ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు సాయంత్రం 4 గంటల తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఆయనను 6గంటల పాటు పోలీసులు నిర్బంధించారు. నల్ల దుస్తులతో దీక్షకు దిగిన ఆయన మీడియాప్రతినిధులతో మాట్లాడుతూ తప్పుచేసిన వారిని శిక్షించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పక్షపాత వైఖరి అవలంబిస్తూ అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం ..ప్రతిపక్ష నేతలకు మరోక న్యాయం లాగా వ్యవహిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తమ ఐపిఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై, ఆయన గన్‌మ్యాన్‌పై గూండాల మాదిరిగా తెలుగుదేశం నేతులు, వారి అనుచరగణం దాడికిదిగినప్పటికీ చంద్రబాబు వెనుకేసుకొచ్చి క్షమాపణతో సరిపెట్టి వారిపై కేసులు లేకుండా చేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు. దాడిచేసిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. మధ్యవర్తిత్వం పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడి కేసులు లేకుండా చేస్తుంటే, ఇక చట్టాలు, పోలీసులు ఎందుకని అన్నారు. గతంలో తిరుపతి విమానాశ్రయంలో తాము ఏ తప్పూ చేయకపోయిన ఎంపి మిథున్‌రెడ్టిని, శ్రీకాళహస్తి వైసీపీ ఇన్‌ఛార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డిని, తనను ఆరెస్ట్‌చేసి నెల్లూరు జిల్లాలోని జైల్లో పెట్టి 21 రోజులు పాటు ఉంచారని గుర్తుచేశారు. అధికార బలంతో తెలుగుదేశం నేతలు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా, వారిని ఆరెస్ట్ చేయకుండా చంద్రబాబు కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యపాలన ఉందా, లేక తాలిబాన్ల పాలన కొనసాగుతోందా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులకే రక్షణలేకపోతే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ నుండి వుంటుందని ... ఆయన మాట్లాడుతుండగానే ఉదయం 10.30 గంటల సమయంలో అసెంబ్లీ వద్ద వున్న మార్షల్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధర్నాను భగ్నం చేస్తుండగా విషయం తెలుసుకుని అసెంబ్లీ లోపల వున్న వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కోడాని నాని, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, నారాయణ స్వామి, రామచంద్రరెడ్డి, రవీంద్రరెడ్డి తదితరులు అక్కడకు చేరుకుని, చెవిరెడ్డిని అరెస్ట్ చేయొద్దని, ఆయన చేసిన తప్పేంటని పోలీసులకు అడ్డుగా నిలబడ్టారు. దీంతో అసెంబ్లీ వద్ద వాతావరణం వేడెక్కింది. అయినా సరే మార్షల్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌చేసి బలవంతంగా పోలీసు వ్యాన్‌లో ఎక్కించి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 6 గంటలపాటు పోలీసు స్టేషన్‌లో నిర్బంధించి సాయంత్రం పోలీసులు విడుదల చేశారు.