ఆంధ్రప్రదేశ్‌

వేడుకగా శ్రీశైల మల్లన్న రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, మార్చి 29: శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మల్లన్న రథోత్సవం వేడుకగా జరిగింది. ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి నంది వాహన సేవ నిర్వహించారు. అమ్మవారు రమావాణి సేవిత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్ల రథోత్సవాన్ని కన్నుల పండువగా సంప్రదాయబద్దంగా నిర్వహించారు. తొలుత రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభంగా పోసిన అన్నరాశిని సాత్వికబలిగా సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తోడ్కొనివచ్చి రథంపై ఆశీనులను చేయించారు. హర హర మహాదేవ.. శంభో శంకర అంటూ దిక్కులు పిక్కటిల్లేలా భక్తులు నినాదాలు చేయగా రథం ముందుకు సాగింది. రథోత్సవ దర్శనం వల్ల సర్వపాపాలు పోతాయని, కోరిన కోర్కెలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇఓ నారాయణ భరత్‌గుప్తా దంపతులు, దేవస్థానం ఆస్థాన సిద్దాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ, అర్చక వేదపండితులు, లక్షలాదిగా తరలివచ్చిన కన్నడ భక్తులు పాల్గొన్నారు.