ఆంధ్రప్రదేశ్‌

సమయం లేదు మిత్రమా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 30: పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్ అంశంపై శాసనసభ దద్దరిల్లుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు చల్లబరిచాయి. తన బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ఆయన వాడిన ‘సమయం లేదు మిత్రమా’ అనే డైలాగును బాబు విపక్ష నేత జగన్‌పై ప్రయోగించారు. సమయం లేదు మిత్రమా.. విచారణలో మీరు ఏది కావాలో తేల్చుకోండి. లీకేజీ మీదనా.. స్ట్రింగ్ ఆపరేషన్‌పైనా?.. అని అనగానే అటు పక్క ఉన్న జగన్ కూడా నవ్వారు. దానితోపాటు బాబు విపక్ష నేత జగన్‌పై వేసిన సెటైర్లు కూడా నవ్వించాయి. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు కూడా జగన్‌ను ఉద్దేశించి మరణమా.. శరణమా? తేల్చుకోవాలన్న డైలాగ్ వాడారు. మొత్తానికి బాబు గురువారం సభలో హుషారుగా నవ్వుతూ సభలో నెలకొన్న వాతావరణాన్ని చల్లబరిచేలా మాట్లాడటం అందరినీ ఆకర్షించింది. బాబు ఇలాగే మాట్లాడితే బాగుంటుందని, ఎప్పుడూ సీరియస్‌గా ఉంటే బాగుండటం లేదని పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు