ఆంధ్రప్రదేశ్‌

పనిమంతులకు బాబు ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 30: అమరావతిలో మొదటి సారిగా నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో సభ్యుల ప్రసంగం, వాక్‌చాతుర్యంపై సిఎం చంద్రబాబు అవార్డులు ప్రకటించారు. గత 14రోజులుగా జరిగిన శాసనసభా సమావేశాల్లో ఉత్తమ ప్రసంగం, ఉత్తమ ప్రశ్న, ఉత్తమ ఇంటర్వెన్షన్, ఉత్తమ సప్లిమెంటరీ, బెస్ట్ కౌంటర్, బెస్ట్ ఎటాక్ వంటి అంశాల్లో అవార్డులను ఆయన ప్రకటించారు. గురువారం శాసనసభ వాయిదా పడిన సమయంలో ఆయన ఈ అవార్డులను ప్రకటించడంతో పాటు సభ్యులను ప్రశంసించారు. ముఖ్యంగా ఉత్తమ ప్రసంగానికి ఆలపాటి రాజా, యనమల రామకృష్ణుడు, ఉత్తమ ప్రశ్నకు ప్రత్తిపాటి పుల్లారావు, బెస్ట్ కౌంటర్ ఎటాక్‌లో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఉత్తమ సప్లిమెంటరీలో కాల్వ శ్రీనివాసులకి ఈ అవార్డులను ఇచ్చారు. అలాగే మీడియా పాయింట్‌కు సంబంధించి ఆనందరావు, అనిత, జవహర్, యరపతినేనిలకు అవార్డులతోపాటు ప్రశంసలు ఇచ్చిన బాబు, తనకు కొన్ని అంశాల్లో అవార్డులు వచ్చినట్లు చమత్కరించారు. ముఖ్యంగా శాసన సభలో ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొన్నామన్న ఆయన ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. అయితే అవగాహనా రాహిత్యంతో ప్రతిపక్షం ప్రతీ చిన్న అంశాన్ని బూతద్దంలో చూస్తోందన్నారు. అనవసర విషయాలపై రాద్ధాంతంతో సభను అడ్డుకుంటున్నారన్నారు. సభా సమయాన్ని వృథా చేయడంలో ప్రతిపక్ష నేత జగన్‌కు బెస్ట్ అవార్డు ఇవ్వచ్చన్నారు.