ఆంధ్రప్రదేశ్‌

స్వైన్‌ఫ్లూపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 30: స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు తూర్పు గోదావరి జిల్లాలో బయటపడటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పది పడకలతో కూడిన ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యారోగ్య కేంద్రాల అధికారులను అప్రమత్తంచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, రావులపాలెం ప్రాంతాలకు చెందిన ఇరువురు ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. వీరిలో ఓ యువతి కాకినాడ నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా సదరు బాధితురాలి ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఆరా తీశారు. స్వైన్‌ఫ్లూపై ప్రచారం, అపోహలను పోగొట్టాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రయ్యను కలెక్టర్ ఆదేశించారు.