ఆంధ్రప్రదేశ్‌

కొడుకుకోసం ఎనిమిదేళ్ల నిరీక్షణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 1: గత ఎనిమిదేళ్లు కన్న కొడుకు వస్తాడని ఎదురు చూస్తున్న సత్యంబాబు తల్లి మరియమ్మ ఆశలు నెరవేరేలా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న తన కొడుకు కోసం తల్లి మరియమ్మ రాజమహేంద్రవరం వచ్చింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూస్తూనే వుంది.. కొడు కు కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తోంది. సత్యంబాబు జైలుకు వెళ్ళేటప్పటికీ అతడేమీ చదువుకోలేదు..కేవలం తాపీపని చేసుకుని జీవించేవాడు..జైలు సంస్కరణల్లో భాగంగా అతను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూనే సత్యంబాబు డిగ్రీ పాసయ్యాడు.. ఎనిమిదేళ్ల పాటు జీవితాన్ని నష్టపోయినప్పటికీ..ఇపుడు అతడు విద్యావంతుడుగా బయటకొస్తున్నాడు..2007 డిసెంబర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2010లో నిందితుడుగా శిక్ష పడి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకున్నాడు. సత్యంబాబుకు తల్లి మరియమ్మ, చెల్లెలు వున్నారు. తండ్రి బెంగతో చనిపోయాడు. దాదాపు ఏడేళ్ళుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద సత్యంబాబు తల్లి మరియమ్మ శనివారం రాత్రి వరకు కొడుకు కోసం నిరీక్షిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. చేయని నేరానికి ఇనే్నళ్ళుగా శిక్ష అనుభవిస్తూ ఎట్టకేలకు కోర్టు తీర్పుతో తన కొడుకు తనకు దక్కుతున్నాడని కన్నీరు పెట్టుకుంది. ఆయేషా మీరా హత్య కేసు లో చేయని నేరానికి సుమారు ఏడేళ్ల పాటు శిక్ష అనుభవించిన కుమారుడుని చూసుకునేందుకు తల్లి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద పడిగాపులు కాస్తోంది. సత్యంబాబు విడుదల సాంకేతిక కారణాల వల్ల ఆదివారం ఉదయం అనివార్యమయ్యింది.

చిత్రం..కొడుకు కోసం నిరీక్షిస్తున్న తల్లి మరియమ్మ